Thursday, May 16, 2024
- Advertisement -

స్టైలీష్‌ లుక్‌లో మహర్షి’ సెకండ్ లుక్ విడుదల…

- Advertisement -

భరత్‌ అనే నేను’ లాంటి బ్లాక్‌బస్టర్‌ హిట్‌ తరువాత మహేష్‌ బాబు నటిస్తున్న చిత్రం మ‌హ‌ర్షి. ఈ సినిమాపై అభిమానుల్లో భారీగానే అంచ‌నాలున్నాయి. వంశీ పైడిపల్లి ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. మహేష్‌ ఎన్నడూ లేని బియర్డ్‌ లుక్‌లో మహర్షి చిత్రంలో కనిపించేసరికి సూపర్‌స్టార్‌ అభిమానులు పండగ చేసుకుంటున్నారు. నూతన సంవత్సరం సందర్భంగా ఈ మూవీ నుంచి సెకెండ్ లుక్‌ను విడుదల చేసింది చిత్రబృందం.

సూట్‌లో అలా స్టైలీష్‌గా , కళ్లజోడు ధరించిన మహేశ్ అతని గ్యాంగ్ నడుచుకుంటూ వస్తుండటం ఈ సెకండ్ లుక్ లో కనపడుతుంది. ఈ లుక్ ప్రిన్స్‌ అభిమానులకు మంచి కిక్కిచ్చేలా ఉంది. ఈ సందర్భంగా వంశీ పైడిపల్లి నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పారు. ఈ చిత్రంలో రుషి పాత్రలో మహేష్ నటిస్తున్న విషయాన్ని ప్రస్తావించారు.

కాలేజ్‌లో నడుస్తు వచ్చిన టీజర్‌లో మహేష్‌ గడ్డంతో ఉండగా, ఈ లుక్‌లో పవర్‌ఫుల్‌ బిజినెస్‌మెన్‌లా కనిపిస్తున్నాడు. ఈ మూవీలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తుండగా, అల్లరి నరేష్‌ ఓ ముఖ్య పాత్రను పోషిస్తున్నాడు. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. 2019 ఏప్రిల్ నెలలో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు ‘మహర్షి’

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -