Tuesday, May 6, 2025
- Advertisement -

ఎక్స్ ప్రెషన్స్ తో చంపేసిన పిల్ల ఎవ్వ‌రో తెలుసా?

- Advertisement -

ప్ర‌పంచంలో ఎక్క‌డ ఏం జ‌రిగిన ఠ‌క్క‌న అంద‌రికి తెలుస్తుంది అంటే దానికి కార‌ణం సోషల్ మీడియానే. ఒక మళ‌యాళ సినిమాలోని వీడియో సాంగ్ టీజ‌ర్ ఇప్పుడు ట్రెండ్‌గా మారింది.దీనికి కార‌ణం అందులోని అమ్మాయి ఎక్స్ ప్రెషన్స్. ఈ వీడియోని చూసిన వారంద‌రు ఈ అమ్మాయికి ఫిదా అవుతున్నారు.అంతలా ఈ అమ్మ‌డు హ‌ల్ చల్ చేసింది.ప్రియా ప్రకాష్ వారియర్.. ఈ పేరు ఇప్పటివరకూ ఎవరికీ తెలియదు. కనీసం ఒక్క సినిమా కూడా రిలీజ్ కాకుండా ఆ పిల్ల సంగతి జనాలకు ఎలా తెలుస్తుంది చెప్పండి? కానీ ఇప్పుడీ పేరుతో ఇంటర్నెట్ లో జనాలు తెగ సెర్చ్ చేసి పారేస్తున్నారు. ఇందుకు కారణం ఓ చిన్న వీడియో అంతే.

తన ప్రియుడిని ఎక్స్ ప్రెషన్స్ తో పిచ్చెక్కిస్తున్న పిల్ల ఈ వీడియోలో కనిపిస్తుంది. ఫేస్ బుక్ లో టాప్ ట్రెండింగ్ లో ఉన్న వీడియో ఇది. ఈ వీడియోలో ప్రియా వారియర్ ఎక్స్ ప్రెషన్స్ చూసి జనాలు మత్తులో పడిపోతున్నారు. ప్రేమలో ఎంతటి అద్భుతమైన ఫీల్ ఉంటుందో.. భలేగా చూపించేసింది ఈ అమ్మాయి. కనుబొమ్మలు ఎగరేస్తూ.. కన్ను కొడుతూ.. మూతి వంకర్లు తిప్పుతూ ప్రియా సూపర్బ్ గా కనిపించడమే.. ఈ వీడియోకు ఇంత క్రేజ్ రావడానికి కారణం. ఇదే సినిమా.. ఎవరీ పిల్ల అంటూ జనాల్లో కుతూహలం విపరీతంగా పెరిగిపోయింది.

 

https://youtu.be/rRdi4QIOWzo

 

 

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -