Thursday, April 18, 2024
- Advertisement -

బాలయ్యకు బర్త్ డే విషెస్.. ట్విట్టర్ లో టాప్ ట్రెండింగ్..!

- Advertisement -

ఇవాళ నందమూరి బాలకృష్ణ 61 వ పుట్టినరోజు. ఈ సందర్భంగా సోషల్ మీడియా ద్వారా అభిమానులు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ట్విట్టర్, ఫేస్ బుక్ లో ఎక్కడ చూసినా ఆయన పేరే మార్మోగిపోతోంది. ట్విట్టర్లో అయితే నేషనల్ టాప్ ట్రెండింగ్ లో #హ్యాపీ బర్త్ డే ఎన్బీకే అనే హ్యాష్ ట్యాగ్ టాప్ టూ లో ట్రెండ్ అవుతోంది. బాలయ్య జన్మదినాన్ని పురస్కరించుకుని పలువురు ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.

బాలయ్య సమకాలికుడు, మెగాస్టార్ చిరంజీవి బాలకృష్ణ జన్మదినాన్ని పురస్కరించుకొని ట్విట్టర్ వేదికగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. ‘ మిత్రుడు బాలకృష్ణ కి జన్మదిన శుభాకాంక్షలు. మీరు ఎల్లప్పుడూ ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను.’ అని ట్వీట్ చేశారు. అలాగే జూనియర్ ఎన్టీఆర్ తన బాబాయ్ బాలకృష్ణకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ‘ జన్మదిన శుభాకాంక్షలు బాలయ్య బాబాయ్. మీరు అన్ని వేళలా ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను.’ అని ఎన్టీఆర్ ట్వీట్ చేశారు. ఎన్టీఆర్ చేసిన ఈ ట్వీట్ కూడా ట్విట్టర్లో ట్రెండింగ్ లో ఉంది.

Also Read:అఖండ నుంచి న్యూ పిక్​ .. ఫ్యాన్స్​కు మాంచి కిక్​..

బాలకృష్ణ బర్త్ డే సందర్భంగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఆయన నటిస్తున్న అఖండ సినిమాలోని న్యూ పోస్టర్ నిన్న సాయంత్రం విడుదల చేసిన సంగతి తెలిసిందే. అభిమానులు సోషల్ మీడియాలో ఆ పిక్ ని పోస్ట్ చేసి బాలయ్యకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ తమన్, 14 రీల్స్ బ్యానర్ సహా పలువురు సినీ పరిశ్రమకు చెందిన నటీనటులు బాలయ్య కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

Also Read: చందమామ కోసం సీనియర్ల క్యూ.. పెళ్లి తర్వాత కూడా జోరు తగ్గట్లే..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -