Thursday, May 2, 2024
- Advertisement -

ఫేస్ బుక్ లో నయా ఫీచర్.. ఆకట్టుకుంటుందా ?

- Advertisement -

ప్రస్తుతం ఈ ఇంటర్ నెట్ ప్రపంచంలో సర్వం సోషల్ మీడియాతోనే నడుస్తోంది. ఉదయం నిద్ర లేచినది మొదలుకొని రాత్రి పడుకునే వరకు స్మార్ట్ ఫోన్ పట్టుకొని సోషల్ మీడియా లో గడిపేస్తుంటారు చాలా మంది. ముఖ్యంగా సోషల్ మీడియా రంగంలో ఫేస్ బుక్ ఎక్కువ మందికి చేరువైనా యాప్ గా చెప్పుకోవచ్చు. ఇక యూజర్స్ ను మరింతగా ఆకట్టుకునేందుకు ఫెక్ బుక్ ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్స్ ను కూడా అందుబాటులోకి తీసుకొస్తుంది. ఇప్పటికే టిక్ టాక్ తరహాలో షార్ట్ వీడియోస్ ను పోస్ట్ చేసే ఫీచర్ ను తీసుకువచ్చిన ఫేస్ బుక్ ఇక తాజాగా మరో క్రేజీ ఫీచర్ ను కూడా తీసుకురానుంది.

ఎప్పటి నుంచో యూజర్స్ ఎదురు చూస్తున్న ” ఫీడ్ ” ఫీచర్ ను త్వరలో ఫేస్ బుక్ లో తీసుకురాబోతున్నట్లు ఆ సంస్థ సి‌ఈ‌ఓ మార్క్ జూకర్ బర్గ్ వెల్లడించారు. ఈ ఫీచర్ తో ఫ్రెండ్ చేసే లేటెస్ట్ పోస్టులను ఫీడ్ రూపంలో చూడవచ్చని బర్గ్ తెలిపాడు. ఇక్క ఇప్పటికే ఇన్ స్టాగ్రామ్ పోస్టులు ఫేస్ బుక్ లో పోస్ట్ అయ్యే విధంగా ఫీచర్ తీసుకువచ్చిన ఫేస్ బుక్.. ఇక కొత్తగా ప్రవేశపెట్టే ” ఫీడ్ ” ఫీచర్ ను మరింత డెవలప్ చేస్తున్నట్లు ఫేస్ బుక్ తెలిపింది.

అయితే గత కొన్నేళ్లుగా ఫేస్ బుక్ వాడే వారి సంఖ్య తగ్గిపోతు వస్తోంది. దీనికి ప్రధాన కారణం ప్రైవసీ వల్ల తలెత్తుతున్న సమస్యలేనని టెక్ నిపుణులు చెబుతున్నారు. అంతే కాకుండా ఇతర సంస్థలు అయిన టిక్ టాక్ ( ఇండియా లో బ్యాన్ అయింది ) , ఇన్ స్టాగ్రామ్, అలాగే కొన్ని వీడియో స్త్రీమింగ్ యాప్స్ వంటి వాటి పాపులారిటీ కూడా విపరీతంగా పెరిగిపోవడంతో ఫేస్ బుక్ గట్టి పోటీ ఎదుర్కొంటోంది. మరి రాబోయే కొత్త ఫీచర్స్ తో ఫేస్ బుక్ ఎంత మేర యూజర్స్ ను ఆకట్టుకుంటుందో చూడాలి.

More Like This

ఆధార్ హ్యాక్ చేస్తే.. ప్రభుత్వం రివార్డ్ ఇస్తుందట !

ఇండియాను విడిచిపెడుతున్న భారతీయులు !

భిక్షాటనను.. నిషేదించిన గవర్నమెంట్ ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -