Friday, May 17, 2024
- Advertisement -

ఫోన్‌ ఉంది కానీ సిమ్‌ లేదు – ప్రియ ప్రకాశ్ వారియర్‌

- Advertisement -

ప్రియ ప్రకాశ్ వారియర్ ఓవ‌ర్‌నైట్ స్టార్‌గా మారిన హీరోయిన్‌. ఒక్క వీడియోతో నేష‌న‌ల్ లేవ‌ల్లో గుర్తింపు తెచ్చుకుంది ఈ భామ‌.టాలీవుడ్‌ నుంచి బాలీవుడ్‌ వరకు అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి.దిల్ రాజు సినిమాలో హీరోయిన్‌గా ఎంపికైన‌ట్లు తెలుస్తుంది.ప్రియ ప్రకాశ్ తాజాగా ఓ ఇంటర్వ్యూ లో తన అనుభ‌వాల‌ను పంచుకుంది.ఇప్పటికీ నన్ను ఇంట్లో ఫోన్‌ వాడనివ్వరు. నా వద్ద వన్‌ప్లస్‌ ఫోన్‌ ఉంది. కానీ అందులో సిమ్‌ కార్డు లేదు. అవసరమైతే మా అమ్మ ఫోన్‌ వాడుతుంటాను. ఇంట్లో హాట్‌స్పాట్‌ ఆన్‌ చేసి ఉంటేనే ఫోన్‌ వాడగలను అని చెప్పుకొచ్చింది.

‘ఒరు అదార్‌ లవ్‌’ ఆడిషన్స్‌కు వెళ్లాను. కంగారుతో ఆడిషన్స్‌ సరిగ్గా ఇవ్వలేకపోయాను. దాంతో నన్ను ఓ చిన్న పాత్రకు ఎంపికచేశారు. కానీ పాటలో నేను పలికించిన హావభావాలతో నా పంట పండింది. సినిమాలో నన్ను ఐదుగురు హీరోయిన్‌లలో ఒకరిగా ఎంపికచేశారు అది ఇంత పెద్ద హిట్ అవుతుంద‌ని క‌ల‌లో కూడా అనుకోలేదని చెపింది ప్రియ ప్రకాశ్ వారియర్‌.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -