Thursday, May 16, 2024
- Advertisement -

బాలీవుడ్‌ నుంచి ప్రియా వారియ‌ర్‌కు బంఫ‌ర్ ఆఫ‌ర్‌.

- Advertisement -

ఒక్క వీడియోతో యావత్ దేశాన్ని తనవైపు తిప్పుకున్న మలయాళీ భామ ప్రియా ప్రకాశ్‌ వారియర్‌కు ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి. ‘ఒరు అదార్‌ లవ్‌’ అనే మలయాళీ చిత్రంలో నటించిన ప్రియ ప్రకాశ్‌కు టాలీవుడ్‌ నుంచే కాదు బాలీవుడ్‌ నుంచి కూడా అవకాశాలు వ‌చ్చిప‌డుతున్నాయి.

తాజాగా బాలీవుడ్‌నుంచి బంఫ‌ర్ ఆఫ‌ర్ వ‌చ్చింది. పూరీ, ఎన్టీఆర్‌ కాంబీనేషన్‌లో వచ్చి బంపర్‌ హిట్‌గా నిలిచిన టెంపర్‌ సినిమాను బాలీవుడ్‌లో రీమేక్‌ అవబోతుందన్న విషయం తెలిసిందే. రోహిత్‌ శెట్టి దర్శకత్వంలో, కరణ్‌ జోహార్‌ నిర్మాణ సారథ్యంలో రణ్‌వీర్‌ సింగ్‌ హీరోగా ‘సింబా’ అనే టైటిల్‌తో ఈ సినిమా తెరకెక్కబోతోంది.

మొదట ఈ చిత్రంలో రణ్‌వీర్‌కి జోడీగా ఆలియా భట్‌, శ్రద్ధా కపూర్లు నటించనున్నట్లు వార్తలు వినిపించాయి. ఇప్పుడు ప్రియ ప్రకాశ్‌ పేరు వినిపిస్తోంది. కరణ్‌ జోహార్‌ ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. డిసెంబర్‌ 28న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -