ఒక్క సీన్‌తో ఇండియా మొత్తం ఫేమస్ అయ్యింది ప్రియా ప్రకాష్ వారియర్. ‘ఒరు ఆదర్ లవ్’ సినిమాలోని ఆమె కన్నుగీటుకి కుర్రకారు ఫిదా అయిన విషయం తెలిసిందే. ఆ వీడియోకి యూట్యూబ్‌లో రికార్డు వ్యూస్ వచ్చాయి. ఇంకా ఆ మైకం నుంచి తేరుకోకమునుపే మరోసారి కన్నుగీటి యూట్యూబ్‌లో రద్దీని పెంచేసింది ఈ ముద్దుగుమ్మ. అయితే ఈసారి సినిమా కోసం కన్ను కొట్టలేదు.ఒక ప్రముఖ ఆహార ఉత్పత్తుల సంస్థ తమ కంపెనీ ఉత్పత్తుల కోసం ప్రియా ప్రకాశ్ వారియర్‌తో ఒక ప్రకటనను రూపొందించింది.
మలయాళం, హిందీ సహా ఆరు భాషల్లో విడుదలవుతున్న ఈ ప్రకటనలో ప్రియ మరోసారి కన్నుగీటి కుర్రకారు మతి పోగొట్టింది. పోస్టు చేసిన కొన్ని గంటల్లోనే లక్ష మంది ఈ వీడియోను వీక్షించారు.‘ఒరు ఆదర్ లవ్’ సినిమాలో ప్రియ ప్రకాష్ పార్ట్ పెంచుతు సినిమాను మళ్లీ రీషూటింగ్ చేస్తున్నారు.‘ఒరు ఆదర్ లవ్’ సినిమా జూన్‌లో విడుదల కానుంది.