ప్రముఖ ఈటీవీలో ప్రసారమయ్యే ఢీ ప్రొగ్రాంకు ఎంతటి పాపులారిటీ ఉందో అందరికి తెలిసిందే. 11 సంవత్సరాల నుంచి ప్రసారమవుతున్న ఈ ప్రొగ్రాంకు విపరీమైన రేటింగ్స్ వస్తున్నాయి.గత రెండు సంవత్సరాలు నుంచి ఢీకి జడ్జీగా హీరోయిన్ ప్రియమణి వస్తున్న సంగతి తెలిసిందే.ఎప్పుడు హుషారుగా ఉండే ప్రియమణి నిన్న(బుధవారం) జరిగిన ఎపిసోడ్‌లో ఏడ్చేసింది.దీనికి కారణం ఆమె భర్త ముస్తాఫా రాజ్.నిన్న జరిగిన ఎపిసోడ్‌లో ఓ జంట హిందు ,ముస్లింకు సంబంధించిన పాటకు డ్యాన్స్ వేశారు. ఈ డ్యాన్స్ చూసిన ప్రియమణి చాలా ఎమోషనల్ అయ్యారు.ప్రియమణి ముస్తాఫా రాజ్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.ప్రియమణి పెళ్లి చేసుకున్న సమయంలో ఆమెపై చాలానే విమర్శలు వచ్చాయి.ఓ హిందువు అయి ఉండి ముస్లింను ఎలా పెళ్లి చేసుకుంటావు అని ప్రియమణిని ట్రోల్ చేశారు నెటిజన్లు.రేపు నీకు పుట్టబోయే పిల్లలు కూడా జిహాదిలుగా మారతారని చాలా ఘోరంగా కామెంట్స్ చేశారు.తన పెళ్లి సమయంలో చేసిన కామెంట్స్‌ను గుర్తుకు తెచ్చుకుని కన్నీరు పెట్టుకుంది ప్రియమణి.హిందు,ముస్లిం అందరు సమానమని ,అలా వేరు చూసి చూడవద్దని చెప్పింది ప్రియమణి.తన భర్త ముస్తాఫా రాజ్‌తో చాలా ఆనందంగా ఉన్నానని తెలిపింది.ప్రియమణి ఎమోషన్స్ అవ్వడం చూసి యాంకర్స్ రష్మీ,సుధీర్‌లు కూడా కన్నీరు పెట్టుకున్నారు.
- Advertisement -
ఢీలో ఏడ్చేసిన ప్రియమణి
- Advertisement -
Related Articles
- Advertisement -
- Advertisement -
Latest News
- Advertisement -