Friday, April 26, 2024
- Advertisement -

ప్రియాంక చోప్రా ఇల్లు చూస్తే షాకే..!

- Advertisement -

అమెరికాలోని లాస్ ఏంజెల్స్‌లో గ‌తేడాది స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా విలాస‌వంత‌మైన పెద్ద భవనం ను కొన్న సంగతి అందరికి తెలిసిందే. దాదాపుగా 20 మిలియ‌న్ డాల‌ర్లు(రూ.144 కోట్ల) పెట్టీ లాస్ ఏంజెల్స్ లోని స్థానిక ఎన్సివో ప్రాంతంలోని ఈ విల్లాను కొనుగోలు చేశారు.

కొనెళ్లుగా ప్రేమించుకుని 2018 డిసెంబ‌ర్‌లో పెళ్లి చేసుకున్నారు బాలీవుడ్‌ నటి ప్రియాంక, హలీవుడ్‌ గాయకుడు నిక్‌ జోనాస్‌. ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా వీరు ఇంట్లోనే ఉంటున్నారు. రోజంతా వ‌ర్కవుట్‌లు, పెంపుడు కుక్క‌తో ఉల్లాసంగా గడుపుతున్నారు. ఇక నిక్ సోదరుడు జో జోనాస్‌, అతని భార్య‌ సోఫీ టర్నర్ కూడా ప్రియాంక ఇంటికి కేవలం మూడు కిలోమీట‌ర్ల దూరంలో ఉన్న ఇంటిని కొను‌కున్నారు. ఈ ఇంటిని కూడా దాదాపుగా 14 మిలియ‌న్ల డాల‌ర్ల‌తో కొనుగోలు చేశారు. ఇక లాస్ ఏంజెల్స్ లోని చోప్రా ల‌గ్జ‌రీ ఇల్లును చూసిన ఎవ‌రికైనా మతి పోవాల్సిందే.

ఇంటిలోని ఒక్కో గ‌ది చూస్తుంటే మ‌తి పోయేంత అందంగా, స్టైల్‌గా ఉంటుంది మ‌రి. విశాల‌వంత‌మైన గ‌దులు, ఆధునాత‌న టెక్నాల‌జీతో నిర్మించిన ఈ ఇల్లు స్వ‌ర్గంలా ఉంటుంది. ఇది మూడు ఎకరాలలో విస్తరించి ఉంది. రెండు అంత‌స్తుల‌లో, అద్దాలు, గోడ‌ల‌తో సుంద‌రంగా తీర్చిదిద్దారు. గార్డెన్, స్విమ్మింగ్ ఫుల్‌, జిమ్‌, ఐమాక్స్‌తో స‌హా అన్ని సౌక‌ర్యాలు కలిగి ఉన్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -