హీరో నిఖిల్ పెళ్లిపై షాకింగ్ కామెంట్స్ చేసిన మాధవీలత..!

- Advertisement -

వివాదాలకు చాలా దగ్గరగా ఉంటుంది.. అంతేకాదు అనుకున్నది అనుకున్నట్లు కుండబద్దలు కొట్టీ మరి చెబుతుంది. ఆమె ఎవరో కాదు మాధవీలత. తాజాగా లాక్ డౌన్ లో పెళ్లిళ్లు చేసుకున్న సెలబ్రిటీలను ఉద్దేశించి ఆమె తన ఫేస్ బుక్ లో షాకింగ్ కామెంట్స్ చేసింది.

లాక్‌డౌన్ కారణంగా కేవలం కొద్ది మంది సమక్షంలో పెళ్లిళ్లు చేసుకున్న సెలబ్రిటీలపై తనదైన శైలీలో స్పందిస్తూ… మాస్కులు పెట్టుకొని మ‌రీ పెళ్లిళ్లు చేసుకోవ‌డం ఎందుకు? ఇప్ప‌డు కాక‌పోతే ఇంకో ఏడాది..పిల్ల దొర‌క‌దా లేక పిల్లోడు మారిపోతాడా? అలా మారిపోయే మ‌నుషుల‌తో బంధాలు ఎందుకు? కొన్నాళ్లు ఆగ‌లేని వాళ్లు సంసారాలు చేస్తారా? అంటూ త‌న ఫేస్‌బుక్ అకౌంట్ లో రాసుకొచ్చింది. అయితే మీరు అంటుంది హీరో నిఖిల్ పెళ్లి గురించా అని ఓ నెటిజన్ మాధవిలతను ప్రశ్నించగా.. ఏమో అంటూ స‌మాధానాన్ని దాట‌వేసింది. పేదలు, మధ్య తరగతి వాళ్ళు లాక్ డౌన్ పాటిస్తున్నారు. కానీ సెలబ్రిటీలు మాత్రం మాస్కులు ధరించి మరీ పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. నా పోస్ట్ కేవలం సెలబ్రిటీలకు మాత్రమే అని మాధవిలత క్లారిటీ ఇచ్చింది.

- Advertisement -

దీంతో ఈ అమ్మ‌డు ఇటీవ‌లె పెళ్లి చేసుకున్న నిఖిల్, దిల్ రాజుల గురించే పోస్ట్ చేసిందంటూ ప‌లువురు నెటిజ‌న్లు అభిప్రాయ‌ప‌డుతున్నారు. దాంతో మాధవీలత పోస్ట్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. అయితే కొందరు మాధవీలతను సపోర్ట్ చేస్తున్నారు. మరికొందరు మరో నేల తర్వాత ముహుర్తాలు లేవు అందుకే ఇప్పుడే పెళ్లి చేసుకుంటున్నారు. అందులో నీకు వచ్చిన సమస్య ఏంటి అని విమర్శిస్తున్నారు. అయితే నా ఫేస్‌బుక్ పోస్ట్ నా ఇష్టం. నా భావాల‌ను చెప్పే హ‌క్కు నాకుంది అంటూ పోస్ట్ చేసింది మాధవీలత. నిఖిల్ , డాక్ట‌ర్ ప‌ల్ల‌వీ వర్మ‌ను అతికొద్ది మంది స‌మక్షంలో ఈనెల 14న పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.

Related Articles

Most Popular

- Advertisement -
Loading...

Latest News

- Advertisement -
Loading...