Wednesday, May 22, 2024
- Advertisement -

మహేశ్ ఆమె చెల్లికి ఛాన్స్ ఇస్తున్నారట!

- Advertisement -

మహేశ్‌బాబు తో సినిమా ఛాన్స్ వస్తే..  అదీ హీరోయిన్ గా వస్తే ఎవరు కాదంటారు చెప్పండి. మహేశ్ బాబుకు సౌత్, నర్త్ లలో చాలా ఫాలోయింగ్ ఉంది. నార్త్ అయినా సౌత్ అయినా ఏ రంగానికి సంభందించిన హీరోయిన్ అయినా మహేశ్‌బాబుతో హీరోయిన్ గా ఛాన్స్ కోసం చూస్తుంటారు.

అలాంటి ఛాన్స్ అప్‌కమింగ్ హీరోయిన్‌కి వస్తే ఎగిరి గంతేస్తుంది. ఇప్పుడు అదే జరిగిందని సమాచారం. 

ఏంటంటే ప్రియాంక చోప్రా చెల్లెలు మన్నారా “ప్రేమ గీమ జాన్తానై” చిత్రం ద్వారా తెలుగు రంగానికి పరిచయమైంది. అలానే “జాద్” మూవీ ద్వారా హిందీకి పరిచయమైంది. తెలుగులో తన పేరు స్క్రీన్ మీద బార్భీ హండానే అని పెట్టుకుందంట. ఇప్పుడు ఈ హీరోయిన్ కి మహేశ్ బాబు హీరోగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న చిత్రం బ్రహ్మోత్సవం అన్న సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రంలో ఇద్దరు హీరోయిన్లు ఉంటారట. అందులో ఓ హీరోయిన్ పాత్ర చాలా గ్లామరస్ గా ఉంటుందని సమాచారం. 

ఈ గ్లామరస్ పాత్రకి మన్నారా బాగుంటుందని తీసుకుందామని అనుకున్నారట. ఇటీవల మన్నారని సంప్రదించడం తను చాలా ఆనందంగా ok చెప్పిందని సమాచారం. ఏది ఏమైనా మన్నారా తెలుగులో రెండో సినిమాకి మంచి ఛాన్స్ కొట్టిందనే చెప్పుకోవాలి.   

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -