Monday, April 29, 2024
- Advertisement -

రానా ఆశలు నెరవేరేనా?

- Advertisement -

గత రెండేళ్ళ నుంచి అటు టాలివుడ్‌లో ఇటు బాలివుడ్ లో వరుసగా ప్లాప్స్ ఎదుర్కొంటున్న సినీ హీరో దగ్గుబాటి రానా ఇప్పుడు బాహుబళి మీద చాలా ఆశలు పెట్టుకున్నట్టున్నాడు.

ఎలాగైనా హిట్ వస్తుందని బల్లాలదేవ క్యారెక్టర్ తనకు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చి పెడుతుందని ఆశాభావ వ్యక్తం చేశాడని సమాచారం. తన కెరీర్ గురించి ఒక జాతీయ ఛానల్‌తో మాట్లాడుతూ నాకు ఇప్పుడు ఖచ్చితంగా బాలివుడ్‌లో అయినా టాలివుడ్‌లో అయినా మంచి హిట్ కావాలి. దాని మీదే నా కేరీర్ ఆధారపడి ఉందని అన్నారు. బాలివుడ్‌లో చేసిన దమ్ మారే దమ్ మూవీలో రానా  క్యారెక్టర్ డీసెంట్ గా ఉంటుంది. కాని అంత సక్సెస్‌ని తెచ్చి పెట్టలేదు.

అందుకే రానా ఆశలన్నీ బాహుబళి మీద పెట్టుకున్నాడు. ఈ సినిమా ఇండియన్ రికార్డ్‌గా నిలిచిపోతుందని ఆశతో ఎదురు చూస్తున్నాడు. మరి ఈ ఆశలు ఎంత వరకు నిజం అవుతాయో వేచి చూడాలి. అందరి అంచనాలకు బాహుబళి చేరువవుతుదో లేదా విఫలమవుతుందో జులై 10 న తేలనుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -