Sunday, April 28, 2024
- Advertisement -

నిర్మాత‌ను ముంచేసిన స‌న్నీ లియోన్

- Advertisement -

బాలీవుడ్ శృంగార తార స‌న్నీ లియోన్ పేరు చెబితే చాలు కుర్ర కారు మతిపోతుంది. హాట్ హాట్ అందాల‌తో యావ‌త్ ఇండియా మొత్తం అభిమానుల‌ను సంపాదించుకుంది. బాలీవుడ్‌లోనే కాక తెలుగు,త‌మిళ ఇండస్ట్రీల‌లో కూడా ఐటెం సాంగ్స్ చేస్తు దుమ్ము దులుపుతుంది. అయితే తాజాగా ఓ వివాదంలో ఇరుక్కున్న‌ట్లు తెలుస్తోంది. స‌న్నీ లియోన్ త‌న‌ను చీటింగ్ చేసింద‌టూ ఓ నిర్మాత పోలీసుల‌కు ఫిర్యాదు చేశాడు. భ‌ర‌త్ ప‌టేల్ అనే నిర్మాత స‌న్నీకి లీగ‌ల్ నోటీసులు పంపించాడు. 2017లో భ‌ర‌త్ ప‌టేల్ ప‌టేల్ కీ పంజాబీ షాదీ అనే సినిమాను నిర్మించాడు.

ఈ సినిమాలో ఐటెం సాంగ్ కోసం స‌న్నీని సంప్ర‌దించి 40 ల‌క్ష‌ల‌కు బేరం కూడా కుదుర్చుకున్నాడు. అడ్వాన్స్‌గా 5 ల‌క్ష‌లు ఇచ్చాడు భ‌ర‌త్ ప‌టేల్. అయితే ఈ భామ చివ‌రికి డేట్స్ కుద‌ర‌క సాంగ్ చేయ‌లేదు. పైగా ఇచ్చిన అడ్వాన్స్ కూడా వెన‌క్కి ఇవ్వ‌లేదు. దాంతో త‌న డ‌బ్బు వెన‌క్కి ఇప్పించాల‌ని కోరుతున్నాడు భ‌ర‌త్ ప‌టేల్. ఈ వివాదంలో స‌న్నీ వాద‌న మ‌రోలా ఉంది.తాను ఇచ్చిన డేట్స్ వాడుకోక‌పోగా.. మ‌ళ్లీ త‌న‌కు ఎక్స్ ట్రా డేట్స్ కావాలంటూ నిర్మాత అడిగారంటుంది స‌న్నీ. మ‌రి ఈ వివాదం ఎంత దూరం వెళ్తుందో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -