Saturday, May 4, 2024
- Advertisement -

Project K : ప్రభాస్ ఒక్కడు కాదు ఇద్దరా.. ప్రాజెక్ట్ K ఫ్యూజులు ఎగిరిపోయే న్యూస్..!

- Advertisement -

రెబల్ స్టార్ ప్రభాస్ రీసెంట్ గా ఆదిపురుష్ తో ప్రేక్షకుల ముందుకు రాగా ఆ సినిమా మిక్సెడ్ టాక్ తెచ్చుకోగా సినిమా ఓవరాల్ గా వసూళ్ల పరంగా నిరాశపరచింది. ఓం రౌత్ రామాయణ కథను తనకు ఇష్టం వచ్చినట్టుగా తీశాడని.. సినిమాలో ప్రభాస్ ని సరిగా వాడుకోలేదనే విమర్శలు వచ్చాఇ. ఇక ఆ సినిమా తర్వాత ప్రభాస్ సలార్ సినిమా రాబోతుంది. ఈ సినిమా సెప్టెంబర్ 28న రిలీజ్ ఫిక్స్ చేశారు. రీసెంట్ గా సినిమా నుంచి వచ్చిన ఫస్ట్ లుక్ గ్లింప్స్ ఫ్యాన్స్ ని మెప్పించింది.

ప్రభాస్ ని సరిగా చూపించలేదు అన్న కామెంట్స్ వచ్చినా ప్రశాంత్ నీల్ కె.జి.ఎఫ్ ని మించి సలార్ తీస్తున్నాడని మాత్రం అర్ధమైంది. సలార్ పార్ట్ 1 భారీగా ఉండబోతుంది. అంతేకాదు పార్ట్ 2 కూడా నెక్స్ట్ ఇయర్ ప్లానింగ్ లో ఉందని తెలుస్తుంది. ఇక ఈ సినిమా తర్వాత అత్యంత ప్రతిష్టాత్మకంగా 500 కోట్ల భారీ బడ్జెట్ తో తీస్తున్న సినిమా ప్రాజెక్ట్ కె. మహానటి దర్శకుడు నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో ప్రభాస్ చేస్తున్న ఈ సినిమాపై తారాస్థాయి అంచనాలు ఉన్నాయి.

ఈ సినిమాలో దీపికా పదుకొనె, అమితాబ్ బచ్చన్ నటిస్తుండగా రీసెంట్ గా లోకనాయకుడు కమల్ హాసన్ కూడా సినిమాలో జాయిన్ అయ్యారు. సినిమాలో కమల్ ప్రతినాయకుడి పాత్రలో కనిపిస్తారని తెలుస్తుంది. కమల్ ప్రాజెక్ట్ కె లో భాగం అవడం సినిమా రేంజ్ మరింత పెంచింది. అయితే లేటెస్ట్ గా ప్రాజెక్ట్ కె నుంచి ఒక పోస్టర్ రిలీజ్ చేశారు. రెండు చేతులు ఢీ కొడుతున్న ఈ పోస్టర్ చూస్తే ఒకటి ఐరన్ మ్యాన్ చెయ్యి.. మరొకటి కట్టుతో ఉన్న మాములు మనిషి చెయ్యిలా ఉంది. మామూలుగా అయితే ఒకటి హీరో చెయ్యి మరోటి విలన్ ది అనుకుంటారు.

కానీ లేటెస్ట్ గా వస్తున్న టాక్ ప్రకారం ఆ రెండు చేతులు కూడా ప్రభాస్ వే అని అంటున్నారు. అదేంటి అంటే ప్రాజెక్ట్ కె లో ట్విస్ట్ అదే అని తెలుస్తుంది. ప్రభాస్ హీరోగానే కాదు విలన్ గా కూడా సర్ ప్రైజ్ చేస్తాడట. అంటే ప్రాజెక్ట్ కె లో ఇద్దరు ప్రభాస్ లు ఉంటారన్నమాట. మరి కమల్ పాత్ర ఏంటి అంటే కమల్ విలనే కానీ మెయిన్ విలన్ రెండో ప్రభాస్ అని టాక్. ఇదే నిజమైతే హీరో విలన్ గా ప్రభాస్ డ్యుయల్ యాక్షన్ రెబల్ ఫ్యాన్స్ కి ఫుల్ మాస్ ట్రీట్ అందించే ఛాన్స్ ఉంది.

మొత్తానికి ప్రాజెక్ట్ కెకి పెడుతున్న బడ్జెట్ కి కావాల్సినంత స్టఫ్ నింపుతున్నారని మాత్రం అర్ధమవుతుంది. ఈ సినిమాలో మరో బాలీవుడ్ భామ దిశా పటాని కూడా నటిస్తుంది. సినిమాలో చాలా సర్ ప్రైజ్ లు ఆడియన్స్ ని మెస్మరైజ్ చేస్తాయని అంటున్నారు. 2024 సంక్రాంతికి రిలీజ్ ప్లాన్ చేసిన ప్రాజెక్ట్ కె అనుకున్న టైం కి వస్తుందా లేదా అన్నది త్వరలో తెలుస్తుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -