Thursday, May 16, 2024
- Advertisement -

కౌశ‌ల్‌ను తిట్టిన హౌస్‌మెట్స్ రెచ్చిపోయిన ప‌బ్లిక్‌

- Advertisement -

బిగ్‌బాస్ రెండో సీజ‌న్ మొద‌టి నుంచి వివాదాల‌తోనే నడుస్తుంది.బిగ్‌బాస్ రెండో సీజ‌న్ ద్వారా లైఫ్ లైన్‌లోకి వ‌చ్చాడు కౌశ‌ల్‌.అంత‌కముందు సినిమాలు, కొన్ని సీరియ‌ల్స్ ద్వారా ఫేమ‌స్ అయాడు కౌశ‌ల్. సాధార‌ణ సెల‌బ్రిటీగా బిగ్‌బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన కౌశ‌ల్ మూడో వారంలోనో,నాల్గో వారంలోనో బ‌య‌టికి వ‌స్తాడ‌ని భావించారు ప్రేక్ష‌కులు.కాని ఇప్పుడు ఏకాంగా బిగ్‌బాస్ రెండో సీజ‌న్ టైటిల్ రేస్‌లో ముందున్నాడు కౌశ‌ల్‌.తోటి హౌస్‌మెట్స్ అంద‌రు ఎంత‌గా టార్గెట్ చేస్తున్న స‌హ‌నం కోల్పోకుండా ,అత‌ను గేమ్ ఆడుతున్న విధానానికి బ‌య‌ట కౌశ‌ల్‌కు చాలామంది అభిమానులు త‌య్యారైయ్యారు.ఎప్ప‌టిలాగే ఇంటి స‌భ్యులంద‌రు కౌశ‌ల్‌ను టార్గెట్ చేసుకున్నారు మిగిలిన ఇంటి స‌భ్యులు.కాకపోతే ఫైన‌ల్ ద‌గ్గ‌ర ప‌డ‌టంతో కౌశ‌ల్‌తో గొడ‌వ‌ల‌కు మ‌రింతగా రెడీ అవుతున్నారు తోటి హౌస్‌మెట్స్‌.

మంగ‌ళ‌వారం జ‌రిగిన ఎపిసోడ్‌లో ఇది స్ఫ‌ష్టంగా క‌నిపించింది.త‌నీష్ గొడ‌వ‌ను వ్య‌క్తిగ‌తంగా తీసుకుని త‌న్నుకునే వర‌కు వెళ్ల‌డం చూస్తే ,వారు కౌశ‌ల్‌ను ఎంత‌లా టార్గెట్ చేశారో క‌నిపిస్తుంది.కౌశ‌ల్‌ను ఇంత‌లా టార్గెట్ చేయ‌డంపై మండిప‌డుతున్నారు నెటిజ‌న్లు.ఒక్క‌డిని ఇలా చేయ‌డం వారు ఫైర్ అవుతున్నారు.కౌశ‌ల్ కాబ‌ట్టి మీతో ఇంకా స‌హ‌నంగా ఉన్నాడ‌ని వేరే వారు అయితే ఎప్పుడో కొట్టుకునేవార‌ని వారు తెలుపుతున్నారు.గేమ్‌ను గేమ్‌లా ఆడాలి కాని ఇలా వ్య‌క్తిగ‌తంగా ఒక్క‌రిని చేసి ఇలా చేయ‌డం చాలా త‌ప్పు అని ప‌బ్లిక్ భావిస్తున్నారు.మీరు కౌశ‌ల్‌ను ఎంత బ్యాడ్ చేయాలి అనుకుంటే అంతాలా కౌశ‌ల్‌కు అభిమానులు పుట్టుకొస్తార‌ని నెటిజ‌న్లు సోష‌ల్ మీడియాలో రెచ్చిపోయ్యారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -