Wednesday, May 15, 2024
- Advertisement -

నాపై ఎందుకు త‌ప్పుడు వార్త‌లు రాస్తున్నారు- అనుప‌మ

- Advertisement -

‘అ ఆ’ సినిమాతో తెలుగు తెర‌కు ప‌రిచియ‌మైంది హీరోయిన్ అనుప‌మ పరమేశ్వరన్. ఈ సినిమాలో చిన్న రోల్ అయిన త్రివిక్ర‌మ్ సినిమా కావ‌డంతో ఓకే చెప్పింది అనుప‌మ‌.త‌రువాత ప్రేమ‌మ్,శ‌త‌మానం భ‌వితి ,ఉన్న‌ది ఒకటే జింద‌గి ,వంటి వ‌రుస హిట్ల‌తో దూసుకుపోయింది.అయితే ఆమెపై మీడియాలో నిత్యం నెగిటివ్‌గా వార్త‌లు వ‌స్తునే ఉన్నాయి.తాజాగా వాటిపై మీడియాను ప్ర‌శ్నించింది అనుప‌మ‌. కాస్టింగ్ కౌచ్ ఉందని శ్రీరెడ్డి ఎప్పుడైతే ఆరోపణలు చేయడం మొదలుపెట్టిందో.. అప్పటినుండి నటీమణులు ఈ విషయంపై పలు రకాలుగా స్పందిస్తున్నారు.

అనుపమ పరమేశ్వరన్ కూడా ఈ విషయంపై స్పందించిందని పేర్కొంటూ ప్రముఖ మీడియా సంస్థ వార్తలు రాసింది.అయితే త‌ను కాస్టింగ్ కౌచ్ గురించి త‌ను ఎక్క‌డి మీడియాతో మాట్లాడ‌లేద‌ని ,కాని కొన్ని వెబ్‌సైట్‌ల‌లో తాను కాస్టింగ్ కౌచ్‌పై స్పందించిన‌ట్లు వార్త‌లు రావ‌డం చూసి నాకు చాలా బాధేసింద‌ని చెప్పుకొచ్చింది.ఇలాంటి వార్త‌లు రాసి నన్ను చెడుగా చూపించాడానిక ప్ర‌యత్నిస్తున్నారంటు ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది అనుప‌మ‌.ఈ విష‌యంలో త‌న‌కు మ‌ద్ద‌తుగా నిలిచిన వారిక కృత‌జ్క్షతలు తెలిపింది అనుప‌మ‌.రామ్ హీరోగా న‌టిస్తున్న ‘హలో గురు ప్రేమకోసమే’ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది అనుప‌మ‌.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -