Saturday, May 18, 2024
- Advertisement -

ఆ హీరో నన్ను తప్ప అందరినీ ముద్దుపెట్టుకున్నాడు అంటున్న హీరోయిన్

- Advertisement -

‘రంగస్థలం’ మరియు ‘దర్శకుడు’ వంటి సినిమాలలో తన నటనతో ప్రేక్షకులను మెప్పించిన పూజిత పొన్నాడ ఇప్పుడు ‘7’ అనే ఒక రొమాంటిక్ థ్రిల్లర్ సినిమా లో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతోంది. ఈ సినిమాలో హవిష్ హీరోగా నటిస్తుండగా ఈమెతో పాటు మరో ఐదుగురు అమ్మాయి లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. నిజార్ షఫీ దర్శకత్వం వహించిన ఈచిత్రం జూన్ 5 న విడుదల కాబోతోంది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పూజిత తన పాత్ర గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది.

ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొంటూ తన పాత్ర చాలా ఆసక్తికరంగా ఉంటుందని చెబుతున్న పూజిత సినిమాలో ఉన్న లిప్ లాక్ సీన్లు గురించి కూడా రియాక్ట్ అయ్యింది. ఇప్పటికే ఈ చిత్రం టీజర్ మరియు ట్రైలర్లలో హరీష్ మరియు మిగతా హీరోయిన్ల మధ్య ఘాటు లిప్ లాక్ లు ఉన్నాయని తెలుస్తోంది. దీని గురించి మాట్లాడుతూ సినిమాలో ఉన్న అయిదుగురు హీరోయిన్లను హవిష్ ముద్దు పెట్టుకున్నాడు అని కానీ హవిష్ ముద్దు పెట్టుకోని హీరోయిన్ మాత్రం నేనే అని చెప్పుకొచ్చింది ఈ భామ. ఇక ఈ సినిమా కాకుండా పూజిత చేతిలో మరికొన్ని ఆసక్తికరమైన ప్రాజెక్టులు ఉన్నట్టు తెలిపింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -