Wednesday, May 8, 2024
- Advertisement -

రంగస్థలం పూజిత ఇలా అయిపోయిందేంటి?

- Advertisement -

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్ర లో వచ్చి సంచలన విజయం సాధించిన చిత్రం రంగస్థలం ఎంత పెద్ద విజయం సాధించిందో మన అందరికీ తెలిసిన విషయమే. ఈ సినిమా లో రామ్ చరణ్ సోదరుడి గా ఆది పినిశెట్టి నటించగా అతని ప్రేయసి గా పూజిత పొన్నాడ అనే తెలుగమ్మాయి నటించింది. అంతకు ముందే అడపా దడపా సినిమాలు చేసినా కానీ ఈ సినిమా తో మాత్రమే గుర్తింపు తెచ్చుకుంది ఈ భామ. అయితే ఇప్పుడు ఈ అమ్మాయి తాజాగా కల్కి సినిమా లో ఒక కీలక పాత్ర చేస్తుంది. ఈ సినిమా త్వరలో విడుదల కానుంది. రాజశేఖర్ ప్రధాన పాత్ర లో నటిస్తున్న ఈ సినిమా కి ప్రశాంత్ వర్మ దర్శకుడు.

అయితే కల్కి సినిమా లో పూజిత పోషిస్తున్న పాత్ర కి సంబంధించి ఒక లుక్ ని చిత్ర యూనిట్ విడుదల చేశారు. ఇందులో ఆమె పాత్ర గురించి చెప్తూ, తన అమాయకత్వమే పీడ కల లా మారింది అని యూనిట్ తెలియపరిచింది. పాలపిట్ట అనే పాత్ర లో పూజిత ఈ సినిమా లో కనిపించనుంది. తన లుక్ పూర్తిగా విభిన్నం గా ఉంది. అది చూసిన అందరూ పూజిత ఏంటి ఇలా మారిపోయింది అని అంటున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -