Monday, April 29, 2024
- Advertisement -

బూమ్రా వేగంతో పోటీ పోటీప‌డుతున్న‌ ఇండియ‌న్ రైల్వే…

- Advertisement -

భార‌త్ పేస‌ర్ బూమ్రా బౌలింగ్ వేగంగురించి చెప్పాల్సిన ప‌నిలేదు. ఇప్ప‌టికే ఐసీసీ ర్యాంకిగ్స్‌లో 1 బౌల‌ర్‌గా కొన‌సాగుతున్నారు. బూమ్రా వేసె బంతులు బుల్లెట్‌లాగా దూసుకుపోతాయ‌ని ఇప్ప‌టికే మాజీ క్రికెట‌ర్లు త‌మ అభిప్రాయాలు వ్య‌క్తం చేసిన సంగ‌తి తెలిసిందే. ఇద‌లా ఉంటె ఆఫ్ఘానిస్తాన్ మ్యాచ్‌లో 49వ ఓవర్‌లో ఏదో కంప్యూటర్‌లో ప్రోగ్రామ్ సెట్ చేసినట్లుగా ప్రతి బాల్ పర్ఫెక్ట్‌గా యార్కర్లు వేశాడు.

బూమ్రా బాల్ వేస్తే అది గంటకు 150 కిలోమీటర్లకు పైగా వేగంతో దూసుకెళ్తోంది. పలు సందర్భాల్లో బూమ్రా బాల్ స్పీడ్ 150 కిలోమీటర్ల మార్క్‌ను దాటింది. ఐతే బూమ్రా వేగాన్ని అందుకోవాల‌ని ఇండియ‌న్ రైల్వే పోటీ ప‌డుతోంది.ఇండియన్ రైల్వేస్ ఢిల్లీ-ముంబై, ఢిల్లీ-కోల్‌కతా మార్గంలో రైళ్లను బూమ్రా బౌలింగ్ వేగం కన్నా ఎక్కువ స్పీడ్‌తో నడపాలని భావిస్తోంది. అంటే గంటకు 160 కిలోమీటర్ల వేగంతో రైళ్లను నడపనుంది. ప్ర‌స్తుతం ఈ రూట్ల‌లో రైళ్ల వేగం గంట‌కు 130 కి.మీ. మాత్ర‌మే. రైళ్ల స్పీడ్ పెరిగితే ఢిల్లీ-హౌరా మధ్య ప్రయాణ సమయం 17 గంటల నుంచి 12 గంటలకు, ఢిల్లీ-ముంబై మధ్య ప్రయాణ సమయం 15.5 గంటల నుంచి 10 గంటలకు తగ్గుతుంది. రైళ్ల వేగం పెంపుకు ఆమోద ముద్ర వేశారు పియూష్ గోయ‌ల్‌. దీన్ని కేబినేట్‌కు పంపారు. మ‌రి బూమ్రా వేగాన్ని ఇండియ‌న్ రైల్వే అందుకుంటాదో లేదో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -