Wednesday, May 8, 2024
- Advertisement -

‘ఇస్మార్ట్’ ప్లాన్ వేసిన పూరి జగన్నాథ్

- Advertisement -

పూరి జగన్నాథ్ దర్శకత్వం లో రామ్ పోతినేని ప్రధాన పాత్రలో త్వరలో రానున్న చిత్రం ఇస్మార్ట్ శంకర్. ఈ సినిమా లో నభ నటేష్ మరియు నిధి అగర్వాల్ హీరోయిన్లు గా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా కి పాజిటివ్ బజ్ ఉన్నప్పటికీ సినిమా ఎలా ఉంటుంది అనే విషయం పై అందరికీ డవుట్స్ ఉన్నాయి. నిజానికి రామ్ కి గాని పూరి కి కానీ హిట్స్ లేకపోవడం తో ఈ సినిమా మీద చాలా మందికి భయం ఉన్న మాట వాస్తవం. ఇద్దరికీ కచ్చితం గా ఈ సినిమా విజయవంతం అవ్వాలి. అప్పుడే వీరి కెరీర్స్ గాడి లోకి వస్తాయి. అయితే ఒకవేళ కొంచెం సినిమా టాక్ అటూ ఇటూ అయినా ప్రమాదం ఉండే అవకాశం ఉంది. అందుకోసం పూరి ఒక ఇస్మార్ట్ ప్లాన్ వేసాడు అని చెప్పుకోవచ్చు.

సినిమా కి ఓపెనింగ్స్ చాలా ముఖ్యం. చాలా తక్కువ బడ్జెట్ తో సినిమా ని చేస్తున్నారు కాబట్టి చిత్ర యూనిట్ కి ఓపెనింగ్స్ వస్తే దాదాపు గా ఇన్వెస్ట్మెంట్ రికవర్ అయినట్టే. అందుకోసమే కొంచెం సినిమా టాక్ అటూ ఇటూ అయినా ఓపెనింగ్స్ మీద ఆ ప్రభావం ఉండకూడదు అనే ఉదేశ్యం తో సినిమా లో గ్లామర్ డోస్ మంచిగా అద్దించారట. ఇద్దరు హీరోయిన్లు ఒక రేంజ్ లో ప్రేక్షకులకి కనువిందు చేయనున్నారు అని వినికిడి. వాళ్ళ కోసమైనా సినిమాకి వచ్చే వాళ్ళు ఉంటారు కాబట్టి ఓపెనింగ్స్ గట్టిగా వస్తే చాలు అనే ఉదేశ్యం తో ఉన్నాడట దర్శకుడు. మరి ఏమవుతుంది అనేది చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -