Monday, May 20, 2024
- Advertisement -

రవితేజ, పూరీల కాంబోలో.. చిరంజీవి కథ!

- Advertisement -

ఆటోజానీ… అంటూ చిరంజీవితో సినిమా చేయబోతున్నానని చాలా హడావుడి చేశాడు పూరీ జగన్నాథ్. చిరంజీవి 150 వ సినిమాగా ఇది తెరకెక్కుతుందని…ఇప్పటికే కథను కూడా చిరంజీవికి వివరించానని పూరీ చెప్పుకొచ్చాడు. అయితే ఆ సినిమా కథ మెగాస్టార్ తిరస్కృతికి గురైందని తర్వాత వార్తలు వచ్చాయి.

ఈ విషయాన్ని తనకు డైరెక్ట్ గా చెప్పాలేదని అంటూ పూరీ కొంత అసహనం కూడా వ్యక్తం చేసిన విషయం విదితమే. ఇప్పుడు అందుకు సంబంధించిన డెవలప్మెంట్ ఏమిటంటే.. అదే కథను రవితేజకు చెప్పి ఒప్పించాడట పూరీ. ఆటోజానీ పేరుతో రవితేజ, పూరీల కాంబోలో సినిమా తెరకెక్కనుందని తెలుస్తోంది.

ప్రస్తుతం రవితేజ తన రెండు కమిట్ మెంట్స్ తో బిజీగా ఉన్నాడు. ఇక పూరీ చేతిలో కూడా రెండు సినిమాలున్నాయి. అవి పూర్తి కాగానే ఆటోజానీ మొదలవుతుందని భోగట్టా. ఇది వరకూ పూరీ, రవితేజలది హిట్ కాంబో అనిపించుకుంది.

వీరి కాంబోలో కొన్ని సెన్షేషనల్ హిట్స్ ఉన్నాయి. అయితే వీరి కాంబోలో వచ్చిన చివరి సినిమా మాత్రం డిజాస్టర్ గా నిలిచింది. మరి ఈ నేపత్యంలో ఆటోజానీతో వీరిద్దరూ కలిసి హిట్ కొడతారేమో చూడాలి! 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -