Monday, April 29, 2024
- Advertisement -

రికార్డు సృష్టించిన ’పుష్ప-2’ వీడియో..!

- Advertisement -

క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న అప్ కమింగ్ మూవీ ” పుష్ప పార్ట్ 2 ”. మొదటి భాగం పాన్ ఇండియా స్థాయిలో సంచలన విజయాన్ని నమోదు చేయడంతో రెండవ భాగంపై విమరితమైన బజ్ ఏర్పడింది. దాంతో ఎక్కడ కంప్రమైజ్ కాకుండా పుష్ప-2 సినిమాని రూపొందిస్తున్నారు చిత్రయూనిట్.

పుష్ప పార్ట్ 1 కి కొనసాగింపుగా తెరకెక్కుతున్న ” పుష్ప ది రూల్ ” పార్ట్ 2 ను మరింత గ్రాండ్ గా తెరకెక్కించేందుకు ప్లాన్ చేసారు డైరెక్టర్ సుకుమార్. పుష్ప రాజ్ హీరోయిజాన్ని ఎలివేట్ చేసేలా… యాక్షన్ డోస్ ఇంకాస్త పెంచి అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా పుష్ప ఎక్కాడా?, పుష్ప ఎక్కడున్నాడో తెలిసే వీడియోను చిత్ర బృందం విడుదల చేసింది. ఇప్పుడు ఈ విడియో యూట్యూబ్‍లో రికార్డు సృష్టించింది.

తెలుగు, హిందీ, క‌న్న‌డ‌, త‌మిళ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో కలిపి 100 మిలియన్ల వ్యూస్, 3.3 మిలియన్ల లైక్స్ సాధించి రికార్డును సృష్టించింది చిత్ర యూనిట్ వెల్లడించింది. ’పుష్ప రాజ్ తన బ్లాక్ బస్టర్ రూల్ ను ప్రకటించాడు’ అంటు ట్వీట్ చేశారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -