Monday, April 29, 2024
- Advertisement -

ఇలా చేస్తే.. ఖచ్చితంగా బ్రెయిన్ షార్ప్ అవుతోంది!

- Advertisement -

మనిషికి శారీర ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యం చాలా ముఖ్యం. కొన్ని ఆరోగ్యకరమైన ఆహారాలు రెగ్యులర్ గా తినడం వల్ల బ్రెయిన్ పవర్ ను షార్స్ గా ఉంచుకోవచ్చు. అలాగే కొన్ని మెదడు ఆరోగ్యాన్ని క్షీణింపచేసే పదార్థాలకు దూరంగా ఉండటం వల్ల కూడా బ్రెయిన్ ను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. కాబట్టి, మీరు హెల్తీ అండ్ షార్ప్ బ్రెయిన్ పొందాలంటే మీ రెగ్యులర్ డైట్ నుండి మీరు కొన్ని ఖచ్చితంగా తొలగించాలి. అవేంటో తెలుసుకుందా, బ్రెయిన్ హెల్త్ ను కాపాడుకుందాం..

  • ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ మన ఆహారాలకు మంచి ఫ్లేవర్ ను అందిస్తుంది. అలాగే బ్రెయిన్ సెల్స్ క్షీణతకు దారితీస్తుందని, దాంతో మతిమరుపు వంటి బ్రెయిన్ సమస్యలకు కారణమవుతుందని రీసెంట్ గా జరిగిన పరిశోధలన ద్వారా వెల్లడైనది.
  • కొన్ని రకాల చేపల్లో మెర్క్యురి ఎక్కువగా ఉంటుంది. ఇది బ్రెయిన్ సెల్స్ మీద ప్రభావం చూపుతుంది,. నెగటివ్ గా పనిచేసేలా చేస్తుంది. కాబట్టి మెర్క్యురి ఎక్కువగా ఉన్న ఆహారాకలు దూరంగా ఉండాలి.
  • బేకరీ ఫుడ్స్ లో పాస్ట్రీస్(రొట్టెలు), బ్రెడ్ లో మార్గరిన్ ఎక్కువగా ఉండటం వల్ల, ఇవి మెదడులోని కణాలు ముడుచుకోయేలా చేయండ లేదా మెదడు వాపుకు గురిచేస్తాయి.
  • హెల్తీ అండ్ షార్స్ బ్రెయిన్ కోసం డైట్ టిప్స్ అనుసరించే వారు, తప్పనిసరిగా నివారించాల్సి ఫుడ్స్ లో పాస్త ఒకటి. ఎందుకంటే పాస్తాలో కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి. వీటిలో ఉండే ఫ్యాట్స్ మెమరీ ఫంక్షన్స్ ను తగ్గిస్తుంది, మెదడు క్షీణించడానికి కారణమవుతుంది. కాబట్టి, ఇటువంటి ఆహారాలకు దూరంగా ఉండటం మంచిది.
  • సాప్ట్ డ్రింక్స్ (శీతల పానీయాలు)లలో షుగర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇది బ్రెయిన్ హెల్త్ మీద తీవ్రప్రభావం చూపుతుంది. హైపోథాలమస్ కు డ్యామేజింగ్ ఎఫెక్ట్స్ ను కలిగిస్తుంది.
  • ఫ్రెంచ్ ఫ్రైస్, పిజ్జా వంటి ‘‘జంక్ ఫుడ్స్’’ బ్రెయిన్ హెల్త్ కు అంత మంచివి కావు, ఇవి బ్రెయిన్ సెల్స్ ను ఇన్ఫ్లమేషన్ కు గురిచేస్తుంది మరియు హైపర్ టెన్షన్ కు కారణమవుతుంది.
  • ఆల్కహాల్ బ్రెయిన్ మీద నేరుగా ప్రభావం చూపుతుంది. మెమరీ వంటి బ్రెయిన్ ఫంక్షన్ కు హాని కలిగిస్తుంది. బ్రెయిన్ సెల్స్ ను క్షీణింప చేయడంతోపాటు, డిప్రెషన్ కు దారితీస్తుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -