Friday, May 3, 2024
- Advertisement -

అభిమానం చూపించ‌డంలో త‌మిళ‌ హీరోలు తోపులే

- Advertisement -
అభిమానికి ఇల్లు క‌ట్టిచిన లారెన్స్‌
 
అభిమానం అంటే ఒక‌రిపై ఒక‌రికి ఉండాలి. ఈ ప‌ద్ధ‌తిని త‌మిళ‌నాడు ప్ర‌జ‌లు, సినీ న‌టులు తుచ పాటిస్తారు. కోలీవుడ్‌లో న‌టీన‌టులంద‌రికీ వీరాభిమానులు ఉంటారు. తాము అభిమానించే వారికోసం ఏమైనా చేస్తారు. అంత చేసేవారికి సినీ న‌టులు కూడా అదే స్థాయిలో అభిమానం చూపిస్తారు. దీనికి ఉదాహ‌ర‌ణగా కోలీవుడ్‌లో ఓ సంఘ‌ట‌న జ‌రిగింది. రెండేళ్ల కింద‌ట జల్లికట్టుపై నిషేధం తొల‌గించాల‌ని ఆందోళ‌న‌లు నెల పాటు జ‌రిగాయి. కేంద్రం మెడ‌లు వంచి మ‌రీ త‌మ డిమాండ్‌ను సాధించుకున్నారు. అయితే ఈ ఆందోళనలో యోగేశ్వర్ అనే యువకుడు మ‌ర‌ణించాడు. ఈ యువ‌కుడు న‌టుడు, నృత్య ద‌ర్శ‌కుడు రాఘ‌వ లారెన్స్‌కు వీరాభిమాని. అత‌డి మ‌ర‌ణం విషయం తెలుసుకున్న లారెన్స్ కుటుంబాన్ని పరామర్శించారు. 
 
కుటుంబ‌స‌భ్యుల బాగోగులు అడిగి తెలుసుకున్నారు. వెళ్తూ.. వెళ్తూ.. మ‌ర‌ణించిన యోగేశ్వర్ కోరిక ఏంటీ అని ఆ యువ‌కుడి తల్లిదండ్రులను అడిగారు. త‌మ‌ అబ్బాయికి సొంత ఇల్లు కట్టుకోవాలని… ఇ ఇంట్లో మీ (లారెన్స్‌) ఫొటో పెట్టుకొని చూసుకోవాల‌ని కోరిక అని చెప్పారు. వెంట‌నే లారెన్స్ మీ కొడుకు కోరిక‌ను నేను తీరుస్తా.. ఇల్లు నేను క‌ట్టిస్తా.. నా అభిమాని కోరిక తీర్చడం త‌న‌ ధర్మం అని లారెన్స్ చెప్పారు. ఇచ్చిన హామీని నిల‌బెట్టుకుని లారెన్స్ ఆ అభిమాని కుటుంబ‌స‌భ్యుల‌కు ఇల్లు నిర్మించి ఇచ్చాడు. ఆ ఇంట్లోకి ఫిబ్రవరి 7వ తేదీ బుధవారం ఆ కుటుంబ‌స‌భ్యులు  గృహ ప్రవేశం చేశారు. ఈ ఇంటి నిర్మాణానికి రూ.15 లక్షల వరకు ఖర్చు అయ్యిందని తెలుస్తోంది. ఒక్క పైసా కూడా యోగేశ్వర్ కుటుంబం ఖర్చు చేయ‌లేదు. మొత్తంగా లారెన్స్ క‌ట్టివ్వ‌డంతో లారెన్స్ మ‌రింత మంది అభిమానుల‌ను సంపాదించుకుంటున్నారు. రియ‌ల్ హీరోగా నిలుస్తున్నాడు. లారెన్స్ వీటితో పాటు క్యాన్స‌ర్ చిన్నారుల‌కు ఉచితంగా శ‌స్త్రచికిత్స‌లు చేయిస్తున్నాడు. 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -