Saturday, April 20, 2024
- Advertisement -

విలన్ రాహుల్ దేవ్ తమ్ముడు స్టార్ విలన్ అన్న విషయం తెలుసా..?

- Advertisement -

సినిమాల్లో హీరో క్యారెక్టర్ ఎంత ప్రధాన్యం ఉంటుందో.. అలానే విలన్ కి కూడా అంతే ప్రాముఖ్యత ఉంటుంది. మూవీలో విలనిజం ఏ స్థాయిలో ఉంటే.. హీరో స్థాయి అదే స్థాయిలో పేలుతోంది. అందుకే హీరో క్యారెక్టర్ కి సమానంగా విలన్ పాత్రలను సృష్టిస్తారు మన దర్శకులు. బాహుబలి సినిమానే తీసుకుంటే సినిమాలో ప్రభాస్ క్యారెక్టర్ కి ఆ రెంజ్ క్రేజ్ వచ్చిందంటే.. భల్లాలుడు అదే స్థాయిలో ఉన్నాడనమాట.

ఎంత మంది కట్టప్పలు ఉన్నా సినిమాకి బాహుబలి తర్వాతా భళ్లాలుడే కదా ముఖ్యం. మరి మన హీరోలు ఎలా ఉంటారో తెలిసిందే కదా, కండలు తిరిగిన దేహాలతో ఆరడుగుల ఎత్తులో హీరో అంటే ఇలా ఉండాలిరా అన్నట్టు ఉంటారు, మరి అలాంటి హీరోలని ఎదుర్కునే విలన్లు అంటే ఎలా ఉండాలి, వాళ్ళు కూడా అలాగే కండలు తిరిగిన దేహాలతో హీరోకి గట్టి పోటీ ఇచ్చేలా ఉండాలి, మెయిన్ విలన్ కాకపోయినా విలన్ తమ్ముడు లేక కొడుకు క్యారెక్టర్ లో అదరగొట్టడానికి అయిన ఇలాంటి విలన్స్ ఉండాలి కదా, మరి అలాంటి విలన్స్ ఈ ఇద్దరు అన్నదమ్ములు.

ఒకరు రాహుల్ దేవ్ అయితే ఇంకొకరు ముకుల్ దేవ్, మన సినిమాల్లో వచ్చే విలన్ అన్న, తమ్ముడు, కొడుకు క్యారెక్టర్స్ లో వీళ్ళే చాలా వరకు కనిపిస్తారు. ప్రస్తుతం ప్రకాష్ రాజ్, షాయాజీ షిండే లాంటి విలన్స్ తర్వాత మెయిన్ విలన్ క్యారెక్టర్లో మెప్పిస్తున్న బ్రదర్స్ వీళ్ళే. ఎన్నో సినిమాల్లో కలిసి విలన్ గా నటించిన వీళ్లిద్దరు అన్నదమ్ములని చాలా మందికి తెలియదు. రాహుల్ దేవ్ ఎప్పటి నుంచో సినిమాలో విలన్ గా చేస్తున్నాడు. సింహాద్రి సినిమాలో అతనికి బాగా పేరు వచ్చింది. ఇక ముకుల్ దేవ్ కి కృష్ణ మూవీతో తెలుగులో బాగా ఫాపులర్ అయ్యాడు.

Image result for rahul dev brother of mukul dev

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -