Monday, May 13, 2024
- Advertisement -

అర్థాంత‌రంగా ముగిసిన టీటీడీపీ అత్య‌వ‌స‌ర స‌మావేశం..

- Advertisement -

తెలంగాణా టీడీపీ వ‌ర్కింగ్ ప్ర‌సిడెంట్ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి వెల్తున్న వార్త‌ల నేప‌థ్యంలో పార్టీలో అల‌జ‌డి మొద‌ల‌య్యింది. రాహుళ్ గాంధీని క‌ల‌వ‌డం వెంట‌నె ఏపీ మంత్రుల‌పై ఆరోప‌న‌లు చేయ‌డంతో పార్టీ ఉక్కిరిబిక్కిర అవుతోంది. దీంతో అత్య‌వ‌స‌రంగా స‌మావేశాన్ని నిర్వ‌హించింది.

రేవంత్‌ వ్యవహారంపై చర్చించేందుకు బాస్‌ చంద్రబాబు ఆదేశాల మేరకు టీటీడీపీ నేతలు శుక్రవారం ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటుచేసిన సంగతి తెలిసిందే. ఈ స‌మావేశానికి రేవంత్‌రెడ్డి హాజ‌ర‌య్యారు. అయితె స‌మావేశం ర‌సాభాస‌గా మారి అర్థాంత‌రంగా ముగిసింది. స‌మావేశంలో రేవంత్ రెడ్డికి …ఇత‌ర నేత‌ల మ‌ధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది.

ఎవరి అనుమతితో కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని కలిశారని రేవంత్ ను మోత్కుపల్లి, అరవింద్ ప్రశ్నించారు. చంద్రబాబు అనుమతి తీసుకున్నారా నా నేత‌లు ప్ర‌శ్నించారు. సొంత పార్టీకి చెందిన ఏపీ నేతలపై విమర్శలు ఎలా చేస్తారని ప్రశ్నించారు. దీనికి సమాధానంగా, మీడియాలో వచ్చిన వార్తలకు తాను ఎలా బాధ్యుడిని అవుతానని రేవంత్ అన్నట్లు స‌మాచారం.

స‌మావేశం ఆర్థాంత‌రంగాముగియ‌డంతో చంద్రబాబు వద్దే ఈ విషయం తేల్చుకుందామంటూ మోత్కుపల్లి, అరవింద్ వెళ్లిపోయారు. ప‌రినామాలు చేస్తుంటె రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ఖండువా క‌ప్పుకోవ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -