Friday, May 3, 2024
- Advertisement -

మహేష్ అభిమానులకి భయపడుతున్న రాహుల్?

- Advertisement -

చి ల సౌ అనే సినిమా తో దర్శకుడి గా అరంగేట్రం చేసిన రాహుల్ రవీంద్రన్ ఆ సినిమా తో నాగార్జున దృష్టి లో పడ్డాడు. వెంటనే నాగార్జున తో మన్మధుడు 2 అనే సినిమా చేసాడు రాహుల్. ఈ సినిమా రేపు విడుదల కానున్న తరుణం లో ప్రమోషన్స్ లో బిజీ గా గడుపుతున్నాడు రాహుల్. ప్రమోషన్స్ లో భాగం గా నిన్న అభిమానుల తో ట్విట్టర్ లో ముచ్చటించాడు.

ఈ ట్విట్టర్ ఇంటరాక్షన్ లో భాగం గా ఒక అభిమాని, రాహుల్ రవీంద్రన్ ని మహేష్ బాబు తో ఒక మంచి లవ్ స్టోరీ చేయమని చెప్పగా, అందుకు రాహుల్ చెప్పిన సమాధానం అందరినీ ఆశ్చర్యపరిచింది. నిజానికి మహేష్ బాబు కి అభిమాని అయిన రాహుల్ వెంటనే సినిమా చేస్తాను అని చెప్తాడేమో అని అందరూ అనుకున్నారు కానీ అనూహ్యం గా రాహుల్ మాత్రం, “కానీ ఫాన్స్ అందరూ మాస్ కావాలని తిడతారు గా” అని సమాధానం ఇచ్చాడు.

ఈ విషయం ప్రస్తుతం సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది. మరి నిజం గా అవకాశం వస్తే కూడా రాహుల్ ఈ విధం గా నే రియాక్ట్ అవుతాడా అనే విషయం చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -