Saturday, May 18, 2024
- Advertisement -

టీ20 క్రికెట్ చరిత్రలో ప్రపంచ రికార్డ్ నెలకొల్పిన దక్షిణాఫ్రికా స్పిన్నర్‌ కొలిన్‌ అక్రమాన్‌…

- Advertisement -

టీ-20 పొట్టి ఫార్మెట్ కు ప్రపంచ వ్యాప్తంగా ఆదరణ ఉంది. ఈ పొట్టి క్రికెట్ పార్మాట్ వచ్చిన తర్వాత.. భారీ స్కోర్ చేయడం.. ప్రత్యర్థి జట్టు పెట్టిన భారీ టార్గెట్లను సైతం సులువుగా ఛేదించడం చూస్తున్నాం. కాని టీ20 క్రికెట్ చరిత్రలో ప్రపంచ రికార్డు నెలకొల్పాడు దక్షిణాఫ్రికా క్రికెటర్, లీసెస్టర్‌షైర్ కెప్టెన్ కొలిన్ అకర్‌మన్న్ .

ఒకే మ్యాచ్‌లో ఏకంగా ఏడు వికెట్లు తీసి కొత్త రికార్డు నెలకొల్పాడు. బర్మింగ్‌హామ్‌‌ బేర్స్‌, లీసెస్టర్‌షైర్‌ ఫాక్సెస్‌ మధ్య జరిగిన కౌంటీ క్రికెట్‌ టీ20లీగ్‌ ఈ వరల్డ్ రికార్డుకు వేదికైంది. కొలిన్‌ కేవలం 18 పరుగులిచ్చి ఏడు వికెట్లతో చెలరేగిపోయాడు. దీంతో టీ-20ల్లో ఒకే ఇన్నింగ్స్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా రికార్డుకెక్కాడు.

ప్రత్యర్థి జట్టులోని మైకేల్‌ బర్గెస్‌, సామ్‌ హైన్‌, విల్‌ రోడ్స్‌, లియామ్‌ బ్యాంక్స్‌, అలెక్స్‌ థామ్సన్‌, హెన్రీ బ్రూక్స్‌, జీతన్‌ పటేల్‌ వికెట్లు సాధించాడు. దాంతో 20 పరుగుల వ్యవధిలో వార్విక్‌ షైర్‌ ఎనిమిది వికెట్లు కోల్పోయింది.2011లో మలేసియా బౌలర్‌ అరుల్‌ సుప్పయ్య.. ఐదు పరుగులు మాత్రమే ఇచ్చి.. ఆరు వికెట్లు తీసి రికార్డు సృష్టించగా.. ఆ రికార్డును ఇప్పుడు కొలిన్ బద్దలు కొట్టాడు.

మొదట బ్యాటింగ్ చేసిన లీసెస్టర్‌ షైర్‌ నిర్ణీత ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 189 పరుగులు చేసింది. హరీ స్విండెల్స్‌(63), లూయిస్‌ హిల్‌(58)లు హాఫ్‌ సెంచరీలు సాధించి జట్టు గౌరవప్రదమైన స్కోరును సాధించింది. 190 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన వార్విక్‌ షైర్‌ …. కొలిన్‌ చెలరేగడంతో బర్మింగ్‌హామ్‌ జట్టు 17.4 ఓవర్లలో 134 పరుగులకే చాప చుట్టేసింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -