Tuesday, May 7, 2024
- Advertisement -

ఒకప్పుడు గ్రేట్ లవర్స్‌ స్టోరీలను ఫీలవ్వుతున్న రాజ్‌తరుణ్

- Advertisement -

హీరో రాజ్‌తరుణ్ ‘లవర్‌’ సినిమా టీజర్‌ ను చిత్రయూనిట్ యూట్యూబ్‌లో రిలీజ్ చేసింది. లవర్ సినిమా టీజర్‌కు మాంచి రెస్పాన్స్ వస్తోంది.

హిట్ కోసం ఎదురుచూస్తున్న హీరో రాజ్‌తరుణ్ ‘లవర్’ సినిమాలో వినోదాత్మకంగా పాత్రను తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ‘‘ఒకప్పుడు గ్రేట్ లవర్స్‌ స్టోరీలను కొందరు చెబుతుంటే చాలా ఓవర్‌గా చెబుతున్నారని అనుకునే వాడిని రా.. కానీ, ఇప్పుడు చెబుతున్నాను. అప్పట్లో వాళ్ల ఫీల్ ఇప్పుడు నేను ఫీలవ్వుతున్నారా’’ అంటూ ఈ టీజర్ మొదలైయింది. ‘‘నా ప్రేమ విశ్వమంత.. నువ్వు తప్పించుకోలేవు’’, ‘‘కొంచెం ఓవర్ చేస్తున్నట్లు లేదురా? అని ఫ్రెండ్ అంటే ‘‘అస్సలు లేదు’’ అని రాజ్‌తరుణ్ చెప్పే డైలాగుతో టీజర్ ముగుస్తుంది.

ఈ చిత్రంతో హీరోయిన్‌గా పరిచయమవుతోంది రిద్ధి కుమార్‌. దిల్ రాజు నిర్మాణ సారథ్యంలో శ్రీవేంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై వస్తున్న ఈ సినిమాకు అనీశ్ కృష్ణ దర్శకత్వం వహించారు. ఈ సినిమా జులై 20న ప్రేక్షకుల ముందుకురానుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -