Saturday, April 27, 2024
- Advertisement -

నందమూరి ఫ్యామిలీలో గొడవలు…… వైకాపాలోకి హరికృష్ణ కుటుంబం

- Advertisement -

సమైక్యాంధ్ర ప్రదేశ్ రాష్ట్రం కోసం రాజ్యసభకు రాజీనామా చేసిన తర్వాత నుంచీ పూర్తిగా హరికృష్ణను పక్కనపెట్టేశాడు చంద్రబాబు. ఇక జూనియర్ ఎన్టీఆర్‌కి పిల్లనిచ్చిన మామ నార్నే వెంకటేశ్వరరావు 2014 ఎన్నికల్లోనే వైకాపా తరపున గుంటూరు నుంచి ఎంపిగా పోటీ చేయాలనుకున్నాడు. అయితే అప్పట్లో బాబు కులపెద్దలందరూ నార్నేని అడ్డుకున్నారు. అయితే ఈ సారి మాత్రం నందమూరి కుటుంబంలో చీలిక ఖాయంగా కనిపిస్తోంది. బాలకృష్ణ కూడా ఎన్టీఆర్‌ని పూర్తిగా దూరం పెట్టేస్తున్న నేపథ్యంలో హరికృష్ణతో పాటు ఆయనకు సన్నిహితంగా ఉన్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు రాజకీయంగా ఎదిగే విషయంపై సమాలోచనలు జరుపుతున్నారు.

జగన్ ప్రజాసంకల్పయాత్ర చాలా గొప్ప విషయమని ఆల్రెడీ దగ్గుబాటి వెంకటేశ్వరరావు జగన్‌ పై ప్రశంశల వర్షం కురిపించాడు. ఇక హరికృష్ణతో సన్నిహితంగా ఉండే పురంథేశ్వరి కూడా వైకాపాలో చేరడం ఖాయం అన్న విశ్లేషణ టిడిపి నాయకుల నుంచే వినిపిస్తోంది. వీళ్ళిద్దరితో పాటు హరికృష్ణ, నార్నే వెంకటేశ్వరరావు కూడా వైకాపాలో చేరి గుంటూరు, కృష్ణా, ప్రకాశం జిల్లాల నుంచి ఎన్నికల్లో పోటీ చేసేలా జగన్‌తో సమాలోచనలు చేస్తున్నారన్న విశ్లేషణలు వినిపిస్తాయి. ఈ మొత్తం వ్యవహారానికి మధ్యవర్తిగా కొడాలి నాని వ్యవహరిస్తున్నాడట. తండ్రి హరికృష్ణ, పిల్లనిచ్చిన మామ నార్నే వెంకటేశ్వరరావు వైకాపాలో చేరితే మాత్రం జూనియర్ ఎన్టీఆర్‌కి వైకాపా తరపున ప్రచారం చేయడం తప్పకపోవచ్చు. కనీసం వాళ్ళిద్దరి నియోజకవర్గాల వరకైనా ఎన్టీఆర్‌ కూడా ప్రచారం చేసేలా తారక్‌ని ఒప్పించే ప్రయత్నాలు కూడా చేస్తున్నారట.

ఈ మొత్తం వ్యవహారం ఇప్పుడు నారావారి గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. ఎన్టీఆర్ బొమ్మను ఎవరైనా వాడుకోవచ్చని ఆల్రెడీ జూనియర్ ఎన్టీఆర్ ప్రకటన చేసి ఉన్నాడు. ఇప్పుడు నందమూరి కుటుంబం నుంచి ఎన్టీఆర్‌తో పాటు హరికృష్ణ, పురంధేశ్వరిలాంటి వాళ్ళు వైకాపావైపు మళ్ళే పరిస్థితి వస్తే అది చంద్రబాబుకు కోలుకోలేని దెబ్బ అవుతుందనడంలో సందేహం లేదు. అందుకే జూనియర్ ఎన్టీఆర్ వరకూ ఎట్టి పరిస్థితుల్లోనూ వైకాపాకు ప్రచారం చేయకుండా ఉండేలా సీనియర్ టిడిపి నేతలే అడ్డుకుంటున్నారని తెలుస్తోంది. లోకేష్ రాజకీయాల్లో ఫెయిల్ అవ్వడం ఖాయమని…….అలాంటి పరిస్థితి వస్తే తాత స్థాపించిన పార్టీని మళ్ళీ నందమూరి చేతుల్లోకి తీసుకొచ్చి నడిపించే అవకాశం నీకు వస్తుందని ఎన్టీఆర్‌కి చెప్తున్నారట కొంతమంది టిడిపి నాయకులు. ఎన్నికలు శరవేగంగా ముందుకు వస్తున్న నేపథ్యంలో ముందు ముందు పరిస్థితులు ఎలా ఉంటాయో చూడాలి మరి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -