Thursday, May 16, 2024
- Advertisement -

బిగ్ బాస్ షో పై రాజా రవీంద్ర కామెంట్స్

- Advertisement -

బిగ్ బాస్ షో గురించే ప్రస్తుతం అందరూ చర్చించుకుంటున్నారు. ఈ షో ఎంత పెద్ద విజయం సాధించింది అనే విషయం మన అందరికీ తెలిసిన విషయమే. మొదటి సీజన్ ని తారక్, రెండో సీజన్ ని నాని, ఇప్పుడు మూడో సీజన్ ని నాగార్జున హోస్ట్ చేస్తున్న తరుణం లో అందరూ ఎంతగానో ఆసక్తి గా షో ని ఫాలో అవుతున్నారు.

అయితే బిగ్ బాస్ షో మీద, ఈ షో ఫార్మాట్ మీద, అందులో పాల్గొనే వాళ్ళ మీద ఎప్పటికప్పుడు ఎవరో ఒకళ్ళు ఏవో ఒక విమర్శలు చేయడం సహజ సాధారణం అయిపోతుంది. తాజా గా యూట్యూబ్ లో ని ఒక ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో ప్రముఖ నటుడు రాజా రవీంద్ర బిగ్ బాస్ మీద ఒక ఆసక్తికర కామెంట్ చేసారు.

నిజానికి మూడు సీజన్లకి రాజా రవీంద్ర కి పిలుపు వచ్చిందట కానీ రాజా రవీంద్ర మాత్రం ఆసక్తి చూపలేదట. తను ఒక గది లో గంట సేపు కన్నా ఎక్కువ గడపలేనని, అది తనకి చాలా కష్టమైనా పని అని, అలాంటిది బిగ్ బాస్ కి వెళ్లడమనేది తనకి అసాధ్యం అని రవీంద్ర చెప్పాడు.

అంతే కాకుండా తనకి శ్రీముఖి ఆటతీరు నచ్చుతుంది అని, సీనియర్ అయిన హేమ కూడ పరిస్థితులకి లోబడి నదుచుకోవడం లో విఫలమవుతుంది అని ఆయన అన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -