Saturday, April 27, 2024
- Advertisement -

రాజా సాబ్‌గా ప్రభాస్

- Advertisement -

సంక్రాంతికి ఫ్యాన్స్‌కు అదిరే ట్రీట్ ఇచ్చారు ప్రభాస్. మారుతి దర్శకత్వంలో సినిమా తెరకెక్కుతుండగా సంక్రాంతి పండగ సందర్భంగా సినిమా ఫస్ట్ లుక్‌ని రివీల్ చేశారు.ఈ సినిమాకు రాజా సాబ్ అనే టైటిల్ ఖరారు చేయగా ప్రభాస్ లుక్ అదిరిపోయింది. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు తమిళ,మలయాళ, కన్నడ, హిందీలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాకు ఇండియన్ టాప్ మూవీ టెక్నీషియన్స్ పనిచేస్తున్నారు. మగధీర, బాహుబలి సినిమాలకు పనిచేసిన కమల్ కన్నన్ వీఎఫ్ఎక్స్ అందిస్తున్నారు. కార్తీక్ పలని సినిమాటోగ్రఫీ చేస్తున్నారు. తమన్ సంగీతాన్ని అందిస్తుండగా ప్రస్తుతం రెగ్యులర్ షూటింగ్ జరుగుతోంది.

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ లో నిర్మాత టీజీ విశ్వప్రసాద్ ,వివేక్ కూఛిబొట్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. రొమాంటిక్ హారర్ జానర్ లో మారుతి ఈ సినిమాను తెరకెక్కిస్తుండగా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఫస్ట్ లుక్‌ పోస్టర్‌లో వింటేజ్ లుక్ లో, లుంగీ కట్టుకున్న ప్రభాస్ సూపర్‌గా ఉన్నారు. ఫస్ట్ లుక్ పోస్టర్ లోనే ఒక కలర్ ఫుల్ సినిమా చూడబోతున్నామనే హింట్ ఇచ్చేశారు మారుతి,.

భలే భలే మగాడివోయ్, మహానుభావుడు, ప్రతి రోజు పండగే వంటి బ్లాక్ బాస్టర్ సినిమాలను తెరకెక్కించారు మారుతి. ధమాకా, కార్తికేయ 2 వంటి బ్యాక్ టు బ్యాక్ సూపర్ హిట్ సినిమాలతో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మిస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -