Monday, April 29, 2024
- Advertisement -

వైసీపీ ఎంపీ అభ్యర్థులు వీరేనా?

- Advertisement -

రెండోసారి అధికారంలోకి రావడమే లక్ష్యం…ఇప్పుడు జగన్ ముందున్న టార్గెట్ ఇది. వైనాట్ 175 లక్ష్యంతో ముందుకు వెళ్తున్న జగన్ పెద్ద ఎత్తున సిట్టింగ్‌ల మార్పు చేపట్టారు. గత ఎన్నికల్లో 25 ఎంపీ స్థానాలకు గానూ 22 వైసీపీ గెలవగా ఈసారి క్లీన్ స్వీపే లక్ష్యంగా అభ్యర్థులను ఎంపిక చేస్తున్నారు. ఇప్పటివరకు 9 ఎంపీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. ఇందులో ముగ్గురు సిట్టింగ్‌లకు సీటు నిరాకరించారు.

శ్రీకాకుళం – పేరాడ తిలక్,విశాఖపట్నం – బొత్స ఝాన్సీలక్ష్మి,అరకు (ఎస్టీ) – భాగ్యలక్ష్మి,ఏలూరు – కారుమూరి సునీల్ కుమార్, విజయవాడ – కేశినేని నాని,కర్నూలు – గుమ్మనూరు జయరాం,
తిరుపతి – కోనేటి ఆదిమూలం,హిందూపురం – జే. శాంతమ్మ ,అనంతపురం – శంకరనారాయణ అభ్యర్థులను ఫైనల్ చేశారు. గోరంట్ల మాధవ్,కోటగిరి శ్రీధర్, డాక్టర్ సంజీవ్‌లకు సీటు నిరాకరించారు. బాపట్ల నుండి నందిగం సురేశ్‌,రాజంపేట నుండి మిథున్ రెడ్డి, కడప నుండి వైఎస్ అవినాశ్ రెడ్డి తిరిగి సీటు దక్కించుకున్నారు.

ఇక మిగిలిన 13 ఎంపీ స్థానాలకు పలువురి పేర్లు పరిశీలనలో ఉన్నాయి. విజయనగరం నుండి మంత్రి బొత్స, మజ్జి శ్రీనివాస్ పేర్లు పరిశీలనలో ఉండగా అనకాపల్లి నుండి పీలా రమాకుమారి, కాకినాడ నుండి చలమలశెట్టి సునీల్, రాజమండ్రి నుండి డాక్టర్ అనుసూరి పద్మలత, వీవీ వినాయక్, నరసాపురం నుండి గోకరాజు రంగరాజు,శ్యామలాదేవి, మచిలీపట్నం నుండి వంగవీటి రాధ, గుంటూరు నుండి మోదుగుల వేణుగోపాల్ రెడ్డి,అలీ,లావు శ్రీకృష్ణ దేవరాయలు, ఒంగోలు నుండి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మద్దిశెట్టి వేణుగోపాల్, నంద్యాల నుండి అలీ, నెల్లూరు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పేర్లు పరిశీలనలో ఉన్నాయి. మొత్తంగా త్వరలోనే ఎంపీ అభ్యర్థుల జాబితాను రిలీజ్ చేయనున్నారు జగన్.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -