Friday, May 3, 2024
- Advertisement -

మళ్లీ పరిచయాలు మొదలు పెట్టిన జక్కన్న

- Advertisement -

బాహుబలి సినిమా లో వర్కవుట్ అయినా ఫార్ములానే జక్కన్న మళ్లీ వాడేస్తున్నాడు.దానిలో భాగంగా  రెండో భాగం షూటింగ్ మొదలవడానికి మధ్య ఉన్న గ్యాప్ ని సైతం ఎంతో తెలివిగా ప్రచారంతో సినిమాకు మార్కెట్ ను చేసుకోబోతున్నాడు.ఈ సినిమాలో పాత్రలను ఇపుడున్న టైమ్లో మరొకసారి గుర్తుచేసేందుకు జక్కన్న నడుంకట్టినట్టు తెలుస్తుంది.

బాహుబలిలో అత్యంత ప్రేక్షకాదరణ పొందిన రమ్యకృష్ణ శివగామి పాత్రను ట్విట్టర్ లో ఇప్పటికే ట్వీట్  చేసాడు. రమ్యకృష్ణ కళ్ళపై క్లాప్ కొడుతున్న షాట్ ని పెట్టి ‘ఆ కళ్ళు మొత్తం రాజ్యాన్నే శాసించాయి’ అనే ట్యాగ్ లైన్ ని పెట్టాడు. ఈ ట్వీట్ కి ఆదరణ లభించడంతో జక్కన్న ఈ తరహా గేమ్ ను ఇంకా  కంటిన్యూ చేసే అవకాశం వుంది.    

శివగామి క్యారెక్టర్ తో సరిపెట్టకుండా బళ్లాల దేవ,బిజ్జాల దేవుల పాత్రల తీరును వారిలోని కుటిల రాజకీయ నీతిని భయటపెడుతూ ఆ పాత్రల గురించి ఇప్పటినుంచే ఒక రకమైన నెగిటివ్ షేడ్ ప్రేక్షకుల్లో వచ్చేలా తీర్చిదిద్ది ఆ విధంగా సినిమాపై మరింత ఆసక్తిని కలిగించాలని చూస్తున్నాడు. అందుకే బాహుబలి 2 లో డామినేట్ చేసే పాత్రలను వారి తీరు తెన్నులను ముందుగానే జనాలకు అవగాహన కలిగించి ఆతరువాత సినిమాను థియేటర్లో తెలివిగా ప్రేక్షకులకు ఇంజక్ట్ చేద్దామని చూస్తున్నాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -