Saturday, May 18, 2024
- Advertisement -

పైసా వసూల్ పై రాజమౌళి కామెంట్స్..

- Advertisement -

నందమూరి బాలకృష్ణ, పూరి జగన్నాథ్ కాంబోలో వచ్చిన సినిమా పైసా వసూల్. ఈ సినిమా ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్న బాలయ్య అభిమానులు.. ఇప్పుడు థియేటర్స్ లో పండగ చేసుకుంటున్నారు. సినిమా సూపర్ హిట్ అని జైజైలు కొడుతున్నారు.

సినిమా కథలో దమ్ము లేకపోయిన బాలయ్య బాబు నటన అదరహో అని అంటున్నారు. మరి పూరి అంటే.. ఆ రెంజ్ లో హీరోని చూపిస్తారు. పైసా వసూల్ అద్భుతంగా ఉందని.. సినిమా పక్కా సూపర్ హిట్ అవుతుందని బాలయ్య అభిమానులు అంటున్నారు. ఈ క్రమంలో మరో బాలయ్య సినిమాపై సినీ ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ సందర్భంగా దర్శక దీరుడు రాజమౌళి బాలయ్య పై ప్రశంసలు కురిపించాడు.

గత 100 సినిమాల్లో లేనంత ఎనర్జిటిక్ గా బాలయ్యను పూరి జగన్నాథ్ చూపించాడని కితాబిచ్చాడు. “కోకాకోలా పెప్సీ! బాలయ్య బాబు సెక్సీ!! ఇంతకు మించి ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు” అంటూ ట్వీట్ చేశాడు. ఏది ఏమైన బాలయ్య పైసా వసూల్ సినిమాపై రాజమౌళి పాజిటివ్ గా కామెంట్స్ చేయడం వల్ల.. సినిమాపై మరింత ఆసక్తి పెరిగింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -