Saturday, April 27, 2024
- Advertisement -

కేసీఆర్‌పై న‌మ్మ‌కం కోల్పోతున్న ఎమ్మెల్యేలు….

- Advertisement -

తెలంగాణా సీఎం కేసీఆర్ ప‌రిపాన‌లో గాని, పార్టీలో గాని తీసుకున్న నిర్ణ‌యాల‌ను ఎదురించే స‌హ‌సం ఎవ‌రు చేయ‌రు. ఆయ‌న మాట్లాడె మాట‌ల‌కు, చేసె ప‌నుల‌కు చాలా ఆర్థాలు ఉంటాయి. ఇప్ప‌టి వ‌ర‌కు పార్టీలో ఎదురులేకుండా ఉన్న కేసీఆర్‌కు ఇప్పుడు ప్ర‌తి కూల ప‌రిస్థితులు ఎదుర‌వుతున్నాయి. చాలామంది ఎమ్మెల్యేలు, నాయ‌కులు ఆయ‌న‌ను న‌మ్మే స్థితిలో లేక‌పోవ‌డంతో గులాబి బాస్ ఇర‌కాటంలో చిక్కుకున్న‌ట్లు తెలుస్తోంది.

వ‌చ్చే సార్వ‌త్రిక ఎన్నిక‌ల నాటికి ఎవ‌రికి టికెట్టు కేటాయించాలో గులాబి బాస్ స‌ర్వే నిర్వ‌హించారు. కొన్ని నెలల కిందట నియోజికవర్గాల వారీగా ఎమ్మెల్యేల ప‌నితీరు గురించి స‌ర్వే ద్వారా నివేదికలు తెప్పించి.. ఎవరి పనితీరు ఎలా ఉంది అనేది చూసి దానికి తగ్గట్టుగా రేటింగ్స్ ప్రకటించారు. రేటింగ్స్ లో చాలా మందికి త‌క్కువ రేటింగ్ రావ‌డంతో అప్పుడే చాలామంది ఎమ్మెల్యేల్లో ఆందోళ‌న మొద‌ల‌య్యింది.

ఈ మ‌ధ్య‌నె సిట్టింగ్ ఎమ్మెల్యేల‌కు వారి సీట్లు వారికే కేటాయిస్తాన‌ని… వారిని గెలిపించే బాధ్య‌త తీసుకుంటాన‌ని కేసీఆర్ ప్ర‌క‌టించారు. దాంతో చాలా మంది ప్ర‌జాప్ర‌తినిధులు బిత్తరపోయారు. రేటింగ్స్ బట్టే ఈ సారి ఎమ్మెల్యే సీట్ లు ఉంటాయి అనేమాట బ‌లంగా వినిపిస్తోంది. ఇప్పుడు కెసిఆర్ తాజాగా అందిరకీ టికెట్ ఇస్తా అని చెప్పినా ఎవ్వరూ నమ్మడం లేదు. అదే చేస్తె చాలామంది నాయ‌కుల‌ను పార్టీ వ‌దులు కోవాల్సిందే.

ఇన్నాల్లు నియేజ‌క వ‌ర్గాల పుణ‌ర్విభ‌జ‌న ఉటుంద‌ని సీఎం పెట్టుకున్న ఆశ‌లు అడియాశ‌ల‌య్యాయి. ఎటువంటి విభ‌జ‌న ఉండ‌ద‌ని కేంద్రం తేల్చి చెప్పింది. దీంతో ఇప్పుడు స‌మ‌స్య‌ల్లో ప‌డిన‌ట్లు తెలుస్తోంది. ఇప్పుడు పాలకపక్షంలో వున్న 90+ ఎంఎల్‌ఎలలో మూడోవంతు మంది ఇత‌ర పార్టీనుంచి వచ్చిన వారే. వారంతా గతంలో టిఆర్‌ఎస్‌ అభ్యర్థులనే ఓడించి వచ్చారు. వీరికే టికెట్లు ఇస్తూ పోతే పాత వారి సంగ‌తి ఏమైపోవాలి..?

మొద‌టినుంచి పార్టీలో ఉన్న వారు వారి నియోజికవర్గం లో గెలవడం ముఖ్యం వారికి… తెరాస కాకపోతే వేరె ఆప్ష‌న్ చూసుకుంటారు. తదుపరి ఆప్షన్ చూసుకుంటారు. మరి కెసిఆర్ అందరికీ సిట్టింగ్ లో ఉండగా టికెట్లు ఇస్తా అంటే ఎమ్మెల్యే లు తమ అధినేతను మాటే నమ్మడం లేదు. దీన్ని సీఎం ఎలా అధిగ మిస్తారో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -