Friday, May 17, 2024
- Advertisement -

ఎన్టీఆర్ సినిమాపై జ‌క్క‌న్న కామెంట్‌

- Advertisement -

క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా తెరకేక్కిన చిత్రం  ‘నాన్నకు ప్రేమతో ‘ ఈ సినిమా పాటలకు మరియు ట్రైలర్‍కి ఆదిరిపోయే రెస్పాన్స్ వస్తుంది. ఇంతముందుకు ఎప్పుడు చూడాని విధంగా ఎన్టీఆర్‍ని చాలా కొత్తాగా చూపించాడు సుకుమార్. ఇక ఈ సినిమా కోసం ఎన్టీఆర్ అభిమానులు ఎదురుచూస్తున్నారు.

అలాగే ఈ సినిమా ట్రైలర్ చూసిన దర్శకధీరుడు ఎస్. ఎస్ రాజమౌళి ప్రశంసల వర్షం కురిపించారు. ఎన్టీఆర్‍ను ఇంతకుముందు చూడాని విధంగా సుకుమార్ చూపించడని, ట్రైలర్ చాలా కొత్తగా స్టైలిష్‍గా ఉందని రాజమౌళి తెలిపారు. ఈ సినిమా ట్రైలర్ చూస్తుంటే  ‘నో నాన్ సెన్స్’ చిత్రంగా కనిపిస్తోందని పోస్ట్ చేశారు.

సుకుమార్  టీం మొత్తానికి ఆల్ ది బెస్ట్ తెలుపుతు తారక్ చేస్తున్న 25 వ సినిమా తనకు చిరకాలం గుర్తుండిపోయే సినిమా కావాలని కోరుకుంటున్నా అని చెప్పారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ తండ్రిగా రాజేంద్రప్రసాద్ నటించగా, విలన్‍గా జగపతిబాబు నటించారు. ఎన్టీఆర్ సరసన రకుల్ ప్రీతి సింగ్ హీరోయిన్‍గా నటిస్తుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -