Sunday, May 12, 2024
- Advertisement -

”నేనే రాజు నేనే మంత్రి” రాజమౌళి రివ్యూ

- Advertisement -

రాజమౌళి చాలా రోజుల తర్వాత ”నేనే రాజు నేనే మంత్రి” సినిమాను చూసి ఆ సినిమా రివ్యూ ఇచ్చేశాడు. మరి ”నేనే రాజు నేనే మంత్రి” రాజమౌళికి ఎలా అనిపించింది.. ఏంటా సంగతి ఇప్పుడు చూద్దాం.. ”తేజ గారు నేనే రాజు నేనే మంత్రిని చాలా అద్భుతంగా హ్యాండిల్ చేశారు. ప్రతీ ఒక్కరూ బాగా నటించారు. బళ్లాలదేవుడుని చూసి గర్వపడుతున్నా. కాజల్ బాగుంది. క్యాథరీన్ కూడా బాగుంది. నవదీప్ కూడా చక్కగా చేశాడు. సినిమా ఓపెనింగ్ సీక్వెన్సు.. క్లయమ్యాక్స్ ట్విస్టు అదిరిపోయాయ్.

చాలారోజుల తరువాత ఒక అర్ధవంతమైన సినిమా వచ్చింది” అంటూ తన రివ్యూ ఇచ్చేశాడు రాజమౌళి. ఈ సినిమాకి రాజమౌళి బాగా కనెక్ట్ అయినట్లు కనబడుతోంది. రాజమౌళి రివ్యూ ఏదైతే ఉందో.. అది కామన్ పబ్లిక్ టాక్ తో ఏకీభవిస్తుందో లేదో తెలియాలంటే కొన్ని రోజులు పడుతుంది. అయినా కూడా రాజమౌళి వంటి పెద్ద డైరక్టర్ మెచ్చుకున్నాడు కాబట్టి.. రానా కు చాలా ప్లస్ పాయింట్లు పడినట్లే. తేజ డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా లో హీరోయిన్ కాజల్ నటించింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -