Sunday, May 19, 2024
- Advertisement -

వైసీపీ గెలుపు ఏక‌ప‌క్ష‌మే…..

- Advertisement -

నంద్యాల ఉప ఎన్నిక‌ల్లో అధికార‌,ప్ర‌తిప‌క్షాల మాట‌ల యుద్ధం కొన‌సాగుతోంది.కౌంట‌ర్ల‌మీద కౌంట‌ర్లు ఇచ్చుకుంటున్నారు.మొద‌టినుంచి వైసీపీ దే విజ‌యం అని రాజ‌కీయ విశ్లేష‌కులు అంటున్న వ్యాఖ్య‌లు ఇప్పుడ నిద‌ర్శ‌నంగా మారాయి.

నంద్యాల ఉప ఎన్నికలపై టిడిపి నేత కేఈ కృష్ణమూర్తి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ ఉప ఎన్నికలను తాము రెఫరెండంగా తీసుకోవడం లేదని, సవాల్‌గా తీసుకున్నామని చెప్పారు. అంటే జగన్, రోజాలు చెప్పినట్లు టిడిపికి ఓటమి భయం పట్టుకుందా అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

టిడిపి గెలుస్తుందా ఓడుతుందా అనే విషయాన్ని పక్కన పెడితే… తాము విజయం సాధిస్తామనే నమ్మకం ఉంటే కచ్చితంగా రెఫరెండంగా భావించేవారని అంటున్నారు. కానీ కేఈ మాత్రం రెఫరెండం అని చెప్పకపోవడం వారికి రెండో ఆలోచన కూడా ఉన్నట్లుగా కనిపిస్తోందని అంటున్నారు. టీడీపీ గెలుస్తుంద‌ని గంభీరాలు త‌ప్ప ధీమాగా చెప్ప‌డంలేద‌న్న‌ది తేలిపోయింది.

కేఈ కృష్ణమూర్తి వ్యాఖ్యలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓ అస్త్రంగా ఉపయోగపడతాయని అంటున్నారు. ఎన్నికలను రిఫరెండంగా చెప్పడం లేదంటే వారిలో ఓటమి భయం ఉన్నట్లేనని వైసిపి నేతలు విస్తృతంగా ప్రచారం చేసే అవకాశముందని అంటున్నారు. అలా చేస్తే టిడిపికి దెబ్బే అంటున్నారు.

ఇప్పుడు కేఈ వ్యాఖ్యలు టిడిపిని ఇరుకున పెట్టేవే అంటున్నారు. ఈ వ్యాఖ్యలు టిడిపికి, అలాగే వ్యక్తిగతంగా మంత్రి అఖిలప్రియ, భూమా బ్రహ్మానంద రెడ్డిలకు షాకిచ్చేవే అంటున్నారు. ఈ వ్యాఖ్యలతో వైసిపి ప్రచారం నిర్వహించినా ఆశ్చర్యం లేదంటున్నారు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -