Wednesday, May 22, 2024
- Advertisement -

సైజ్ జీరో ని రీ సైజ్ చేసిన రాజమౌళి !

- Advertisement -

రాఘవెంద్రరావు కీ రాజమౌళి కీ చాలా అభినాభవ సంబంధం ఉంది. గురువుని మించిన శిష్యుడు గా చెప్పుకోవాలి అంటే వీరిద్దరి గురించే చెప్పుకోవాల్సి ఉంటుంది . ప్రస్తుతం రాఘవేంద్ర రావు గారి అబ్బాయి ప్రకాష్ కోవెలమూడి దర్సకత్వం లో వస్తున్న సైజు జీరో సినిమా కి సంబంధించి కొన్ని ప్రత్యెక బాధ్యతలు రాజమౌళి చేతిమీద పెట్టారు అని తెలుస్తోంది.

సైజు జీరో సినిమా పూర్తిగా ఆర్ ఆర్ కూడా చేసాక రాజమౌళికి ప్రత్యేకంగా చూపించారని వినికిడి. ఆయన ఆద్యంతం చూసి, ఒకటికి రెండు సార్లు డిస్కషన్ చేసి, దాన్నిఓ షేప్ కు తీసుకువచ్చినట్లు తెలుస్తోంది. రాజమౌళి చెయ్యి పడిన తరవాత ఈ సినిమాలో చాలా మార్పులు కనిపించాయి అంటున్నారు నిర్మాతలు.

రాఘవేంద్ర రావు ఇప్పటికే చాలా చోట్ల మార్పులు చేర్పులు చేసారు కానీ దానికంటే  బెటర్ గా రాజమౌళి ని రంగంలోకి దింపి రాఘవెంద్రావు మంచి పని చేసారు అని అంటున్నారు నిర్మాతలు. తన కొడుకు డైరెక్టర్ గా మంచి స్థానం సంపాదించాలి అనేది ఆ తండ్రి కల.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -