శ్రీను వైట్ల కష్టాల్లో ఉంటే వారికి సంతోషం

ఏ పరిశ్రమ అయినా ఒడిదుడుకులు సర్వసాధారణం. ప్రస్తుతం శ్రీను వైట్ల టర్మ్ చాలా తీవ్రంగా నడుస్తోంది. ప్లాపులతో సతమతం అవుతున్న ఆయన ఆగడు , బ్రూస్ లీ చిత్రాలతో చిన్నా భిన్నం అయిపోయాడు . మరొక పక్క తనని వేధిస్తున్నాడు అంటూ స్వయంగా ఆయన భార్య రూపా వైట్ల ఆయన మీద కేసులు పెట్టడం.

నిర్భయ యాక్ట్ వరకూ విషయం వెళ్ళడం లాంటివి ఆయన్ని పర్సనల్ గా కూడా చాలా దెబ్బతీసాయి. కానీ శ్రీను వైట్ల కి ఇలా జరగడం మరికొందరు హీరోలకి చాలా అడ్వాంటేజ్ గా చెబుతున్నారు. ఉదాహరణ కి సెకండ్ లైన్ హీరోలైన  విష్ణు, నాగ చైతన్య, రామ్, సౌర్య లాంటి వారు తెగ సంబరపడుతున్నారు.

ఇలాంటి సమయంలో ఆయనతో సినిమా తీస్తే తమ రేంజ్ పెరగడమే కాక ఆయన కి తామేదో ఆఫర్ ఇచ్చినట్టు బిల్డ్ అప్ కూడా ఇచ్చుకొచ్చు అనేది వారి ఆకాంక్ష. నాగచైతన్య ఆయన ఇంటికే వెళ్లి మరీ ఆఫర్ ఇచ్చాడు అని సమాచారం. జూనియర్ లు అంతా శ్రీను వైట్ల తో ఎలాగైనా సినిమా తీయడానికి ఆసక్తి చూపిస్తున్నారు.

వెంట్రుక వేసి కొండని లాగడానికి ప్రయత్నిస్తున్నారు కాబోలు, ఒస్తే కొండంత హిట్ లేదంటే ఎలాగు పరాజయాలు అలవాటేగా !