Thursday, April 25, 2024
- Advertisement -

ఎన్టీఆర్ బ‌ర్త్‌డేకు రాజ‌మౌళి స్పెష‌ల్ గిఫ్ట్ ఏంటో తెలుసా…?

- Advertisement -

మే 20 వ తేదీన ఎన్టీఆర్ పుట్టినరోజు. ప్రతి సంవత్సరం ఎన్టీఆర్ తన పుట్టినరోజును అభిమానుల సమక్షంలో ఘనంగా జరుపుకునేవారు. కాని ఈసారి త‌న పుట్టిన రోజు వేడుకుల‌ను ర‌ద్దు చేసుకున్నారు ఎన్టీఆర్‌. అదే విధంగా రాష్ట్రం వ్యాప్తంగా అభిమానులు ఎవ‌రూ త‌న పుట్టిన రోజు వేడుకల‌ను జ‌ర‌ప‌వ‌ద్ద‌ని ఇప్ప‌టికే సూచించారు.గతేడాది రోడ్డు ప్రమాదంలో ఎన్టీఆర్ తండ్రి హరికృష్ణ మరణించడంతో ఈ ఏడాది పుట్టినరోజు వేడుకలను పక్కన పెట్టేసి ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నాడు.

అయితే జూనియ‌ర్ పుట్టిన‌రోజు 20న రాజ‌మౌళి ఒక స్పెష‌ల్ గిఫ్ట్ ఇవ్వ‌బోతున్న‌ట్లు ఫ‌లిం వ‌ర్గాల్లో టాక్‌.ఎన్టీఆర్… రామ్ చరణ్ కాంబినేషన్లో ఆర్ఆర్ఆర్ మూవీ తెరకెక్కుతోంది. ఇందులో ఎన్టీఆర్ కొమరం భీం పాత్రను చేస్తున్నారు. అందుతున్న సమాచారం ప్రకారం ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఎన్టీఆర్ ఫ్రీ లుక్ ను రిలీజ్ చేస్తారని తెలుస్తోంది. అదే నిజ‌మ‌యితే జూనియ‌ర్ ఎన్టీఆర్‌కు అంత‌క‌న్నా పెద్ద గిఫ్ట్ ఏముంటుంది. అయితే ఇందులో ఎంత నిజం ఉందోగాని 20 వ‌ర‌కు ఆగాల్సిందే.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -