Friday, March 29, 2024
- Advertisement -

ఐసీసీ వరల్డ్ కప్ అధికారిక గీతం విడుదుల‌…

- Advertisement -

మే30 ప్ర‌పంచ క‌ప్ మ‌హా స‌మ‌రం ఆరంభం కానుంది. అంతర్జాతీయ స్థాయిలో జరగనున్న ఈ ఈవెంట్‌లో 10 జట్లను టోర్నమెంట్‌కు ఎంపిక చేశారు. తొలి మ్యాచ్‌ను ఇంగ్లాండ్‌లోని ఓవల్ వేదికగా దక్షిణాఫ్రికా వర్సెస్ ఇంగ్లాండ్ ఆడనున్నాయి.

వరల్డ్ కప్ సందర్భంగా అఫీషియల్ సాంగ్‌ను విడుదల చేసింది ఐసీసీ. ప్రమోషన్ సాంగ్‌లో భాగంగా చేసిన ఈ పాట చిత్రీకరణకు బ్రిటిష్ బ్యాండ్‌ను వైవిధ్యంతో కూడిన సంగీతాన్ని అందించగా లారిన్ అనే కొత్త ఆర్టిస్ట్ భావానికి ప్రాణం పోశాడు. మే 30 నుంచి ప్రపంచకప్‌ జరిగే ప్రతి మైదానంలో ఈ పాట సందడి చేయనుంది.

మే30 నుంచి జులై 14వరకూ జరగనున్న టోర్నీలో 48 మ్యాచ్‌లు జరుగుతాయి. 10సార్లు జరిగిన వరల్డ్ కప్‌లో 5సార్లు ఆస్ట్రేలియానే కప్ గెలుచుకుంది. 2సార్లు ఇండియా, 2సార్లు వెస్టిండీస్ ట్రోఫీలను దక్కించుకోగా శ్రీలంక ఒక్కసారి మాత్రమే టైటిల్ దక్కించుకుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -