Tuesday, May 14, 2024
- Advertisement -

నా కూతుతు హీరోయిన్ అయితే తప్పేంటి..? : రాజశేఖర్

- Advertisement -

హీరో రాజశేఖర్ నటించిన ఎవడైతే నాకేంటి సినిమాలానే నిజ జీవితంలోనూ.. ముక్కుసూటిగా వెళ్తూ వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా ఈ హీరో తన కూతురు శివాని హీరోయిన్ గా ఎంట్రీపై ఇస్తున్న విషయంపై రాజశేఖర్ కామెంట్ చేశారు. పరిశ్రమలో స్టార్ హీరోల కొడుకులు హీరోలుగా వస్తున్నారు. కానీ హీరోల కూతుళ్లు మాత్రం హీరోయిన్స్ గా రావడం లేదు. మాములుగా పరిశ్రమలో తమ అభిమాన హీరో కూతుళ్లు పరిశ్రమలోకి అడుగుపెట్టడంను ఫ్యాన్స్ ఒప్పుకోరు. కానీ రీసెంట్ గా రాజశేఖర్ కూతురు శివాని హీరోయిన్‌గా రావాలని నిర్ణయం తీసుకుంది. ఈ విషయంపై పట్ల తాజాగా రాజశేఖర్ స్పందించారు. చాలా మంది స్టార్ హీరోలు తమ కుమారులను హీరోలుగా పరిచయం చేస్తున్నారని.. కానీ కూతుళ్లను మాత్రం హీరోయిన్స్ గా పరిచయం చేయడం లేదు. ఒక వేళ హీరోయిన్ గా పరిచయం చేసిన.. చాలా కండీషన్స్ ఉంటాయి. మన చిత్రాల్లో వెరే అమ్మాయిలతో కలిసి నటిస్తాం.. రొమాన్స్ చేస్తాం కానీ.. మన ఇంటి ఆడవాళ్ళను మాత్రం ఎవరూ టచ్ చేయకుడదనే ధోరణి ఇండస్ట్రీలో ఉందని అన్నారు. అన్ని ఉద్యోగాల్లో ఆడ, మగ అనే తేడా లేకుండా పని చేస్తున్నారో.. సినిమా ఇండస్ట్రీలో కూడా అంతే.. అందుకే నా కూతురు హీరోయిన్ అవుతానని చెబితే నేను అడ్డుపడలేదు. పరిశ్రమ గురించి నేను తప్పుగా భావించడం లేదు అందుకే నా కూతురు సినిమాల్లోకి రావడాన్ని ప్రోత్సహిస్తున్నానని అన్నారు. హీరోల కొడుకులు హీరోలు అవుతున్నప్పుడు హీరోల కూతుళ్ళు హీరోయిన్లు అవ్వడం ఎలాంటి తప్పు లేదనేది నా అభిప్రాయమని స్పష్టం చేశారు. త్వరలోనే శివాని.. ప్రభు సాల్మన్ దర్శకత్వంలో ఓ తమిళ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వబోతుందని తెలుస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -