Thursday, March 28, 2024
- Advertisement -

రీమేక్ సినిమాలో నటించబోతున్న సీనియర్ హీరో

- Advertisement -

‘పిఎస్వి గరుడ వేగా’ సినిమా తో తన సెకండ్ ఇన్నింగ్స్ ను ప్రారంభించిన సీనియర్ హీరో రాజశేఖర్ ఈ మధ్యనే ‘కల్కి’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. కలెక్షన్ల పరంగా అంత మంచి విజయం సాధించలేకపోవడంతో తన తదుపరి సినిమా పైనే తన ఆశలన్నీ పెట్టుకున్నాడు రాజశేఖర్. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సారి రాజశేఖర్ దర్శకులు చెప్పిన కథల కంటే ఆల్రెడీ హిట్ అయిన కథలను కథలను రీమేక్ చేయడం మేలని అనుకుంటున్నారట. ఈ నేపథ్యంలో రాజశేఖర్ ఒక కన్నడ సినిమా రీమేక్ తెలుగులో రీమేక్ చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

కన్నడ లో సూపర్ హిట్ అయిన ఒక సినిమాని రాజశేఖర్ ఇప్పుడు తెలుగులో రీమేక్ చేయబోతున్నారట. కన్నడ ప్రముఖ నిర్మాత ధనుంజయ ఈ సినిమాని నిర్మించబోతున్నారు. కేవలం తెలుగులో మాత్రమే కాక తమిళంలో కూడా ఈ సినిమా ఒకేసారి రీమేక్ అవ్వనుందట. తెలుగులో రాజశేఖర్ హీరోగా నటిస్తుండగా తమిళంలో మాత్రం సత్యరాజ్ తనయుడు శిబి సత్యరాజ్ ముఖ్య పాత్రలో కనిపించబోతున్నారు. అయితే అసలు ఈ కన్నడ సినిమా ఏంటి అని మాత్రం ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. తెలుగులో కూడా టైటిల్ ఖరారు చేశాక ఈ విషయంపై కూడా అధికారిక ప్రకటన ఇవ్వనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా షూటింగ్ ఇంకా సెట్స్ పైకి వెళ్లాల్సి ఉంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -