Monday, April 29, 2024
- Advertisement -

పాక్ చర్యలను తిప్పికొట్టేందుకు భారత్ ఆర్మీ సిద్దంగా ఉంది…..ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్

- Advertisement -

ఆర్టికల్ 370 రద్దు తర్వాత భారత్ ,పాక్ ల మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఇప్పటికే పాక్ భారత్ తో ఉన్న అన్ని సంబంధాలను తెంచుకుంది. మరో వైపు లడక్ సరిహద్దుల్లో ఉన్న తన ఫార్వర్డ్‌ బేస్‌లకు పాకిస్థాన్‌ యుద్ధ విమానాలను తరలించింది. యుద్ధ విమానాలతో పాటు సీ-130 ట్రాన్స్‌పోర్టు ఎయిర్‌క్రాఫ్ట్‌ల ద్వారా స్కర్దు ఎయిర్‌బేస్‌కు యుద్ధ సామాగ్రిని చేరవేసినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. స్కర్దు ఎయిర్‌బేస్‌ లడఖ్‌కు సమీపంలో ఉంటుంది. స్కర్దు ఎయిర్‌బేస్‌కు జేఎఫ్‌-17 యుద్ధ విమానాలను కూడా పాక్‌ తీసుకొచ్చే అవకాశం ఉందని నిఘా వర్గాలు పేర్కొన్నాయి.

లడఖ్ ప్రాంతంలోని వాస్తవాధీన రేఖకు ఆవల పాకిస్థాన్ సైన్యం క్షిపణులను మోహరించినట్టు వచ్చిన వార్తలపై ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ స్పందించారు. సరిహద్దుల వద్ద ఎటువంటి పరిస్థితిని అయినా ఎదుర్కోవడానికి భారత సైన్యం సర్వ సన్నద్ధంగా ఉందన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -