Sunday, April 28, 2024
- Advertisement -

స్పైడర్ చూసిన రజనీ.. ఏమన్నారో తెలుసా..?

- Advertisement -

స్పైడర్ మూవీ మహేష్ బాబు కెరీర్ లో భారీ బడ్జెట్ తో నిర్మించిన సినిమా. ఈ సినిమా మొదలు అయినప్పటి నుంచి భారీ అంచనాలు ఉన్నాయొ. అయితే ఈ సినిమా ఇటివలే రిలీజ్ అయిన విషయం తెలిసిందే. ఈ సినిమా టాక్ ఎలా ఉన్నప్పటికి కలెక్షన్స్ మాత్రం బాగున్నాయి.

ఇక ఈ సినిమాని ప్రముఖులు వీక్షీంచి ఎవరి స్టైల్ లో వారు ఈ సినిమాని ఆకాశానికి ఎత్తేస్తున్నారు. ఇక మహేష్ బాబు ఫ్యాన్స్ ఈ సినిమా మంచి కిక్ ని ఇచ్చిందని చెప్తుతున్నారు. అయితే ఈ సినిమా తమిళంలో కూడా భారీ స్థాయిలో రిలీజ్ అయిన విషయం తెలిసిందే. మురగదాస్ డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమా కావడంతో అక్కడ చాలా మంది సినీ ప్రముఖులు ఈ సినిమాని చూశారు. తాజాగా రజినీకాంత్ కూడా స్పెషల్ షో వేసుకొని మరి స్పైడర్ సినిమాను చూసి తన అభిప్రాయాన్ని తెలిపారు.

ఆయన మాట్లాడుతూ.. యాక్షన్ తో పాటు మంచి సందేశం ఉన్న సినిమా ఇది. దర్శకుడు మురగదాస్ సినిమాను చాలా బాగా తెరకెక్కించాడు. అలానే మహేష్ నటన కూడా చాలా బావుంది. సినిమా తనకు చాలా బాగా నచ్చిందని రజిని చెబుతూ.. స్పైడర్ లాంటి మంచి సినిమాని ప్రేక్షకులకు అందించినందుకు సినిమా యూనిట్ కి అభినందనలు తెలిపారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -