- Advertisement -

జగన్ కు సొంత జిల్లాలో ఎదురు దెబ్బ

- Advertisement -

ఒక సక్సెస్ వచ్చిందంటే.. ఆ సక్సెస్ మరిన్ని సక్సెసులకు నాంది ఖచ్చితంగా పలుకుతుందని అంటూ ఉంటారు. అలానే ఒక అపజయం.. వైసీపీకి పెద్ద దెబ్బ వేసింది. దాంతో వైసీపీ పార్టీ చాలా దారుణంగా తయరు అయిందని టీడీపీ నేతల మాట. ప్రస్తుతం జగన్ కూడా ఇదే విషయంపై బాధపడుతున్నారని కొన్ని కథనాలు వస్తున్నాయి.

2014లో గెలుపు వరకు వెళ్లలేకపోయిన జగన్.. 2019లో అయినా సీఎం పీఠం దక్కించుకుందామని భావించారు. ఈ క్రమంలో ఆయన అధికార పక్షంపై విసుర్లు, ఖ‌సుర్లు పెంచారు. అయితే ఏది ఏమైన అధికార పార్టీకే ఓట్లు పడుతున్నాయుఇ. వైసీపీకి ప్రజల్లో నమ్మకం ఉన్నప్పటికి ఓట్లు లేవు. ఇలాంటి పరిణామం జగన్ కంటిపై కునుకులేకుండా చేస్తోంది. నిజానికి 2019 ఎన్నిక‌ల్లో విజ‌యం కోసం.. జగన్ భారీ స్కెచ్ వేశారు. వైసీపీ కుటుంబం, గడపగడపకు వైసీపీ, మిస్ట్ కాల్, నవ రత్నాలు వంటి విన్యూత్న పథకాలు ప్రవేశ పెట్టారు. ఈ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీని బలోపితం చేయాలని అనుకున్నారు. ఇందుకోసం పార్టీ కార్యకర్తలకు కూడా పిలుపునిచ్చారు. ఇదంత బానే ఉన్నప్పటికి.. అనూహ్యంగా ఇక్కడ కథ రివర్స్ అయింది. నంద్యాల, కాకినాడ ఎన్నికల రిజల్ట్ తో కేడర్ మొత్తం డీలా పడింది. దీంతో ఇప్పుడు జగన్ పెర్కొన్న కార్య‌క్ర‌మాల‌ను ప్ర‌జ‌ల్లోకి తీసుకువెళ్లే నాధుడే లేకుండా పోయాడ‌ట‌.

అది కూడా జగన్ సొంత జిల్లాలో కావ‌డంతో ఇప్పుడు జ‌గ‌న్‌కి దిగులు ప‌ట్టుకుంద‌ని అంటున్నారు. జగన్ కు రాజకీయంగా మంచి బలం ఉన్న కడపజిల్లాలో కూడా ఈ పరిస్థితి ఉండటం ఆశ్చర్యంను కలిగిస్తోంది. కడప జిల్లాలో కూడా “గడప గడపకీ వైసీపీ” కార్యక్రమాన్ని సమర్థంగా చేపట్టలేకపోతున్నారట. మొత్తంగా ఇప్పుడు జగన్ పరిస్థితి.. అయోమయంలో పడిందట. మరి రాబోయే రోజుల్లో జగన్ ఎలాంటి స్కెచ్ లు వేస్తారో.. ఎలాంటి ప్రణాళికతో ముందుకు వెళ్తారో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -