Thursday, May 16, 2024
- Advertisement -

కాంత్ ల మధ్య ఆగ్రహ సెగలు

- Advertisement -

తమిళనాడు రాజకీయాలు వేడెక్కాయి. త్వరలో జరుగనున్న శాసనసభ ఎన్నికల నేపథ్యంలో నాయకుల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. తమిళ స్టార్ విజయ్ కాంత్ ఈమధ్య సూపర్ స్టార్ ను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీంతో రజనీకాంత్ ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

డిఎండికె అధినేత అయిన విజయ్ కాంత్ మాట్లాడుతూ తాను రజనీకాంత్ లా భయపడనని, బెదిరించినంత మాత్రాన రాజకీయాల నుంచి తప్పుకోనంటూ అన్నారు. అంతే కాదు.. రజనీకాంత్ తమిళ  మూలాలపై కూడా విజయ్ కాంత్ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలతో రజనీ ఫ్యాన్స్ భగ్గుమంటున్నారు.

ఆదివారం నాడు రజనీ కాంత్ అభిమానులు విజయ్ కాంత్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. తాము ఎవరికి ఓటువేయాలో కూడా తమ నటుడు చెప్పలేదని, అలాంటి వ్యక్తిని విమర్శించడం తగదని రజనీ అభిమాన సంఘం చెన్నై శాఖ అధ్యక్షుడు ఎన్.రాందాస్ పేర్కొన్నారు. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -