సూపర్ స్టార్ రజినీకాంత్‌కు ఉన్న క్రేజ్ ఇండియాలో మరో హీరోకి లేదనడంలో ఎటువంటి అనుమానం లేదు. రజినీకాంత్ సినిమాలు విడుదల అవుతుంటే చాలు ఇండియా షేక్ అవుతోంది. అతని సినిమాలు విడుదల రోజున సాఫ్ట్‌వేర్ సంస్థలు అయితే సెలవులు కూడా ప్రకటించిన సందర్భాలు ఉన్నాయి. రజనీ లాస్ట్ సినిమా ‘పేట’ మంచి కలెక్షన్స్ వసూలు చేసి రజనీ ఇమేజ్ కు వచ్చిన ఇబ్బందేమీ లేదని ఋజువు చేసింది.
రజనీ ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్‌తో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా టైటిల్‌ను దర్భార్‌గా ఫిక్స్ చేశారు. కొద్దిరోజుల క్రితం ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా విడుదల చేశారు. తాజాగా ఈ సినిమాలో రజినీకాంత్ లుక్ అంటూ సోషల్ మీడియాలో ఓ పోస్టర్ హల్ చల్ చేస్తోంది. పోలీస్ యూనిఫాం లో ఉన్న రజనీ స్టైల్ గా చేత్తో కూలింగ్ క్లాసెస్ ధరించే పోజ్ ఇది. ఈ ఫోటో చూసి తలైవర్ ఈజ్ బ్యాక్ అంటూ ఫ్యాన్స్ సంతోషపడిపోతున్నారు.
అయితే ఈ పోస్టర్ సినిమాలోనిది కాదని తరువాత తెలిసింది. రజనీ వీరాభిమాని ఒకరు ‘దర్బార్’ పోస్టర్‌ను డిజైన్ చేసినట్లు తెలిసింది. ఇక ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ముంబైలో జరుగుతుంది. ఈ సినిమాలో రజినీకాంత్‌కు జోడిగా నయనతార నటిస్తుంది. సినిమాను దీపావళికి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
- Advertisement -
సోషల్ మీడియాను ఊపేస్తున్న రజినీకాంత్ కొత్త లుక్
- Advertisement -
Related Articles
- Advertisement -
- Advertisement -
Latest News
- Advertisement -